కాంగ్రెస్‌లో 100 సీట్లు క్లియర్‌.. మిగిలింది 19!

congress-election-comittee.jpg

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకోసం కాంగ్రెస్‌లో ఎప్పుడూలేనంత కసరత్తు జరిగింది. ఊరించిఊరించి 45మందితో రెండోజాబితా రిలీజ్‌ చేసింది జాతీయ నాయకత్వం. దీంతో మొత్తం 119 సీట్లలో వంద స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్లే. పదీపన్నెండు సీట్లలో అప్పుడే అసమ్మతి పెల్లుబుకుతున్నా గెలుపు గుర్రాలే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తొలి జాబితాలో చోటు దక్కని పలువురు సీనియర్ నేతలను సెకండ్ లిస్ట్‌లో ప్రకటించారు. కాంగ్రెస్‌ రెండు విడతల్లో ప్రకటించిన 100 మంది అభ్యర్థుల్లో సామాజికవర్గాలవారీగా చూస్తే మూడోవంతు మంది రెడ్లే. రెడ్డి-38, బీసీ-20, వెలమ-9, కమ్మ-3, బ్రాహ్మణ-3, మైనార్టీ- 4, ఎస్సీ-15, ఎస్టీలకు 8 స్థానాలు దక్కాయి.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మధుయాష్కీగౌడ్ లాంటి వారు రెండో జాబితాలో టికెట్లు పొందారు. క్రికెట్ దిగ్గజం మహ్మద్ అజారుద్దీన్‌కు జూబ్లీహిల్స్ టికెట్ లభించింది. ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్దన్‌రెడ్డికి నిరాశే మిగిలింది. ఆయన సోదరి విజయారెడ్డికి మాత్రం ఖైరతాబాద్‌ టికెట్‌ ప్రకటించింది. బీజేపీనుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి పరకాల టికెట్‌ దక్కింది. అంబర్‌సీటు బీసీలకు ఇవ్వాలని వీహెచ్‌ ఎంత మొత్తుకున్నా రోహిన్‌రెడ్డికి అక్కడ టికెట్‌ దక్కింది. ఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ భర్తకు ఆసిఫాబాద్‌ టికెట్‌ కేటాయించారు. సొంత గూటికి తిరిగొచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి అనుకున్నట్లే మునుగోడు టికెట్ ఇచ్చారు.

మొదట్నుంచీ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నేతలకు ప్రాధాన్యం కల్పించాలనే ఆలోచనతో పార్టీ హైకమాండ్ ఉంది. దానికి తగ్గట్లే మొదటి జాబితాలో మొత్తం 12మంది కొత్తవారికి సీట్లు దక్కాయి. రెండో జాబితాలో పార్టీలోకి కొత్తగా వచ్చిన 15 మందికి చోటు లభించింది. మొత్తంమీద నాలుగోవంతుమంది పార్టీలోకి కొత్తగా వచ్చినవారే. కొత్తవారికి టికెట్లతో కాంగ్రెస్‌లో ఏళ్ల తరబడి పార్టీకి సేవలు చేస్తున్నవారికి టికెట్లు దక్కలేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Share this post

submit to reddit
scroll to top