బిచ్చగాడు హీరో 17ఏళ్ల కూతురు సూసైడ్‌!

vijayantoni.jpg

బిచ్చగాడు సిన్మాతో పాపులర్‌ అయిన హీరో విజయ్ ఆంటోని ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పదిహేడేళ్ల ఆయన కూతురు మీరా ఆత్మహత్య కలకలం రేపుతోంది. చెన్నై చర్చి పార్క్ కాలేజ్‌లో ఇంటర్ సెకండియర్ చదువుతున్న మీరా మంగళవారం తెల్లవారుజామున ఇంట్లోని తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. చదువుల్లో ఒత్తిడే విజయ్‌ ఆంటోనీ కూతురి ఆత్మహత్యకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు.

విజయ్ ఆంటోని ఫాతిమా దంపతులకు మీరా పెద్దకూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురి ఆత్మహత్యతో విజయ్ ఆంటోని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. విజయ్ ఆంటోని కూతురి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా విజయ్‌ఆంటోనికి ధైర్యం చెబుతున్నారు. షాక్‌లో ఉన్న విజయ్‌ఆంటోని కూతురి మరణంపై ఇంకా స్పందించలేదు. కానీ గతంలో ఆత్మహత్యల గురించి బిచ్చగాడు హీరో చెప్పిన మాటలను ఈ సందర్భంగా కొందరు గుర్తుచేసుకుంటున్నారు.

అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు? ఆ ఆలోచనలు ఎందుకు వస్తాయ్ అనేదానిపై గతంలో విజయ్ ఆంటోని మాట్లాడాడు. సూసైడ్ థాట్స్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు. ఎవరినైనా ఎక్కువగా నమ్మి మోసపోయినప్పుడు, ఇచ్చిన మాటకు తగ్గట్లు పని చేయలేకపోయినప్పుడు.. చిన్నపిల్లలైతే చదువుల్లో ఒత్తిడితో ఆత్మహత్య ఆలోచనలు వస్తాయని చెప్పుకొచ్చాడు. స్కూల్ నుంచి వచ్చాక పిల్లల్ని ట్యూషన్‌కి పో అక్కడికి ఇక్కడికిపో అంటాం. వాళ్లని సొంతంగా ఆలోచించనివ్వడం లేదు. పిల్లలను కాస్త ఫ్రీగా వదిలేయాలి అంటూ విజయ్ ఆంటోని చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Share this post

submit to reddit
scroll to top