ప్రజాకర్షక హామీలతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో!

congress-manifesto-release-1.jpg

తెలంగాణలో గెలుపు ఖాయమన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్‌ తన ఎన్నికల మేనిఫెస్టోని విడుదలచేసింది. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్చే విడుదలచేసిన మేనిఫెస్టోలో ప్రజాకర్షక హామీలు ఇచ్చింది హస్తంపార్టీ. ముందుగానే ప్రకటించిన ఆరు గ్యారంటీలతోపాటు 36 అంశాలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చారు. అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు గౌరవభృతి అందిస్తామని కాంగ్రెస్‌ హామీఇస్తోంది.

కాంగ్రెస్‌ 6 గ్యారంటీలు

మహాలక్ష్మి పథకం: మహిళలకు ప్రతీ నెలా రూ.2500 సాయం. రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.

రైతు భరోసా: రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరానికి రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, వరిపంటకు క్వింటాలుకు రూ.500 బోనస్‌

గృహజ్యోతి: ప్రతీ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

ఇందిరమ్మ ఇళ్లు: ఇల్లులేని వారికి ఇంటి స్థలం-రూ.5లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం.

యువ వికాసం: విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌.

చేయూత: రూ.4వేల నెలవారీ పింఛను, రూ.10 లక్షల రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా

 • మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు
  వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్‌
  ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌
  తొలి కేబినెట్‌లో మెగా డీఎస్సీ
  పోటీ పరీక్షలకు ఫీజు రద్దు
  మహిళా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు
  గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం
  ధరణి పోర్టల్‌ రద్దు.. ఆ స్థానంలో భూమాత పోర్టల్‌
  ప్రతీ ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.12వేల సాయం
  చేయూత పింఛన్‌ రూ. 4,000
  దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్‌
  కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ
  విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్‌
  వైద్య రంగం బడ్జెట్‌ పెంపు
  కొత్త రేషన్‌ కార్డులు.. రేషన్‌షాపుల ద్వారా సన్న బియ్యం
  రేషన్‌ డీలర్లకు రూ.5 వేల గౌరవ వేతనంతో పాటు కమీషన్‌
  ఆర్టీసీ విలీన‍ ప్రక్రియ పూర్తి చేయడం
  రూ.100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి
  నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్‌ ప్రయోగం
  సీఎం కార్యాలయంలో ప్రతీరోజు ప్రజా దర్బార్‌..
 • congress manifesto for telangana assembly elections

Share this post

submit to reddit
scroll to top