చంద్రబాబు అనుమానాలు రూల్డవుట్‌!

cbn-jail.jpg

జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ఎవరో పెన్‌ కెమెరాతో ఫోటోలు తీస్తున్నారు. జైలుపై డ్రోన్లు సంచరిస్తున్నాయి. కొందరు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారు. ఈ ప్రచారంతో టీడీపీ తీవ్రంగా ఆందోళనపడింది. చంద్రబాబు తన భద్రతపై స్వయంగా మూడు పేజీల లేఖని ఏసీబీ జడ్జికి పంపినట్లు ప్రచారం జరిగింది. అయితే ఎంతకీ బెయిల్‌ రావడం లేదన్న ఫ్రస్టేషన్‌లోనే ఇదంతా జరుగుతున్నట్లుంది. ఎందుకంటే రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబు భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని మరోసారి క్లారిటీ ఇచ్చింది జైళ్లశాఖ.

జైల్లో భద్రత, పెన్ను కెమెరాతో రిమాండ్‌ ఖైదీ తిరుగున్నాడు లాంటి అనుమానాలతో చంద్రబాబు రాసిన లేఖపై జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్ వివరణ ఇచ్చారు. జైల్లో తన భద్రత, ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న చంద్రబాబు ఏసీబీ కోర్టు జడ్జికి రాసిన మూడు పేజీల లేఖని జైలు అధికారులు జడ్జికి పంపారు. పెన్ను కెమెరాతో రిమాండ్‌ ఖైదీ తిరుగుతున్నాడని, తనను చంపుతామని మావోయిస్టుల పేరుతో లేఖ వచ్చిందని, తనని హత్య చేసేందుకు కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆ లేఖలో చంద్రబాబు తెలిపారు. గంజాయి ప్యాకెట్లు గార్డెనింగ్ చేస్తున్న ఖైదీల దగ్గరికి విసిరేస్తున్నారని చంద్రబాబు ఆ లేఖలో సంచలన ఆరోపణలు చేశారు.

చంద్రబాబు లేఖపై జైళ్ల శాఖ డిఐజి రవికిరణ్ వివరణ ఇచ్చారు. మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదని తేలిందన్నారు. చోరీ కేసులో జైలుకొచ్చిన ఓ వ్యక్తి జేబులో బటన్ కెమెరా దొరికిందని, దాన్ని వెంటనే పోలీసులకు అందజేశామన్నారు. చంద్రబాబు ఆరోగ్యం, భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. మరోవైపు చంద్రబాబు కుడి కంటికి ఆపరేషన్‌ చేయాలంటూ వస్తున్న వార్తలపై కూడా జైళ్లశాఖ డీఐజీ వివరణ ఇచ్చారు. చంద్రబాబుకు ఇప్పటికిప్పుడు అత్యవసరంగా కంటి ఆపరేషన్ అవసరం లేదని వైద్యులు చెప్పినట్లు తెలిపారు. అన్నీ బాగున్నాయంటూ అధికారులు చెప్పేస్తుంటే ములాఖత్‌లు తప్ప పాపం ఆయన బయటికొచ్చే దారేది?

Share this post

submit to reddit
scroll to top