భారత్‌పై నిందలు.. సభ్య దేశాలపై ఒత్తిడి

‘భారత్‌పై ట్రూడో ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. కెనడా దర్యాప్తుకు మద్దతిస్తున్నాం. భారత్‌ కూడా ఈ విచారణకు సహకరించాలని కోరుతున్నాం’ – అమెరికా

‘ఈ వార్తలు ఆందోళనకరం. ఈ అంశాన్ని మేం భారత్‌ వద్ద ప్రస్తావించాం. దీనిపై దర్యాప్తు జరగాల్సి ఉన్నందున ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేం’- ఆస్ట్రేలియా

‘ కెనడావి తీవ్రమైన ఆరోపణలు. ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నాం. అయితే ఈ పరిణామాలు భారత్‌తో మా వాణిజ్య చర్చలపై ఎలాంటి ప్రభావం చూపవు’ – యూకే

‘ కెనడా చేస్తున్న ఆరోపణలు నిజమని రుజువైతే అది ఆందోళనకర అంశమే. దీనిపై ఇంతకంటే మాట్లాడబోం’- న్యూజిలాండ్‌

భారత్‌-కెనడా వివాదంపై నాలుగుదేశాల స్పందన ఇది. ఖలిస్థానీ అంశంపై వివాదం కేవలం భారత్‌-కెనడా దేశాలకే పరిమితం కాలేదు. ప్రపంచమంతా దీనిపై చర్చ జరుగుతోంది. ఖలిస్థానీ ఉగ్రవాదుల విషయంలో కెనడాని భారత్‌ ఎప్పట్నించో అప్రమత్తంచేస్తూ వచ్చింది. అయినా పట్టించుకోని కెనడా ఓ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ మర్డర్‌తో మనపైనే నిందలేస్తోంది. ఖలిస్థానీ మద్దతుదారు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ హస్తం ఉందని సాక్షాత్తూ ఆ దేశ ప్రధాని జస్టిస్‌ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో భారత్‌ని బోనులో నిలబెట్టాలనుకుంటున్న కెనడా మిత్ర దేశాల మద్దతుకోసం ప్రయత్నిస్తోంది. ఫైవ్‌ ఐస్ ఇంటెలిజెన్స్‌ అలయన్స్‌ వైపు చూస్తోంది.

విశ్వసనీయ సమాచార మార్పిడి కోసం అమెరికా, యూకే 1946లో UKUSA ఒప్పందం చేసుకున్నాయి. తర్వాత రెండుసార్లు విస్తరించిన ఆ కూటమిలో 1956 నాటికి కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు కూడా చేరటంతో ఫైవ్‌ ఐస్ ఇంటలిజెన్స్‌ అలయన్స్‌ ఏర్పడింది. ఈ కూటమిలోని సభ్య దేశాల నిఘా ఏజెన్సీలు పరస్పరం సమాచార సేకరణలో సహకరించుకుంటాయి. కీలక విషయాలు పంచుకుంటాయి. ఈ ఐదు దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు కూడా ఉంటాయి. ఖలిస్థానీ అంశంపై భారత్‌తో వివాదం తలెత్తటంతో ఈ కూటమి మద్దతు కోసం కెనడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

జీ20 సదస్సుకి ముందే నిజ్జర్‌ హత్యను బహిరంగంగా ఖండించాలని ఫైవ్‌ఐస్‌ గ్రూప్‌ దేశాలను కెనడా కోరింది. అయితే అమెరికాతో పాటు మిగిలిన సభ్యదేశాలు దీనిపై సానుకూలంగా స్పందించలేదు. అయితే తాము సభ్యదేశాలతో ఈవిషయం మాట్లాడలేదంటోంది కెనడా. భారత్‌తో అనుబంధం కీలకం కావటంతో కెనడా నుంచి ఒత్తిడ ఉన్నా సభ్యదేశాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. ఓ పక్క భారత్‌-కెనడా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే కెనడాలో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడు హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థిగ్యాంగ్‌ దాడిలో గ్యాంగ్‌స్టర్‌ సుఖ్‌దోల్‌సింగ్‌ ప్రాణాలు కోల్పోయాడు. నేరముఠాలమధ్య గొడవల్ని నియంత్రించలేకపోతున్న కెనడా ఆ వైఫల్యాల్ని కూడా మన దేశంపై రుద్దాలని చూస్తోంది.

Share this post

submit to reddit
scroll to top