నాయకుడంటే ఇలా ఉండాలి!

kamareddy-manifesto.jpg

గజ్వేల్‌ ఉండగా కేసీఆర్‌ కామారెడ్డినుంచి ఎందుకు పోటీచేస్తున్నారో ఇప్పటికీ చాలామందికి అర్ధంకాని విషయం. 2019 ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన కూతురిని ఈసారి గెలిపించేందుకా? లేదంటే తన పోటీతో నిజామాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా పార్టీకి జోష్‌ రావాలనా? కేసీఆర్‌ ఐడియా ఏదన్నా కావచ్చుగానీ రెండుచోట్లా గెలిస్తే ఆయన గజ్వేల్‌ని ఉంచుకుని కామారెడ్డికి సీటు వదులుకోవడమైతే పక్కా. ఎందుకంటే గజ్వేల్‌ మీటింగ్‌లో అన్యాపదేశంగా ఆయన అదే మాట చెప్పారు. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తానన్నట్లు మాట్లాడారు. మరి రెండుచోట్లా గెలిచి(గెలిస్తేనే సుమీ) కామారెడ్డి వదులుకుంటే ఆ సీటు మళ్లీ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్‌కా? ఆయన ముద్దుల తనయ కవితకా? ముందు గెలవనీ తర్వాత చూసుకోవచ్చంటారా.. సరే ప్రస్తుతానికి ఆ చర్చని కాసేపు పక్కనపెడదాం.

కేసీఆర్‌ పోటీచేస్తున్న కామారెడ్డిలో కాంగ్రెస్‌నుంచి పోటీకి షబ్బీర్‌అలీ రెడీ. మళ్లీ గంప గోవర్దనే ఉంటాడనుకున్నారు ఆ మైనారిటీ లీడర్‌. ప్రభుత్వ వ్యతిరేకతతో ఈసారి ఈజీగా గెలవొచ్చనుకుంటే రేసులోకి కేసీఆర్‌ వచ్చారు. దీంతో రాష్ట్రంలో టైట్‌ ఫైట్‌ ఉండబోయే సీట్లలో కామారెడ్డి కూడా చేరిపోయింది. కానీ అక్కడ పోటీ బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌కే పరిమితం కాదు. బీజేపీనుంచి గట్టి పోటీ ఉండబోతోంది. ఎందుకంటే కమలం పార్టీకి కామారెడ్డిలో ప్రజాబలం ఉన్న స్ట్రాంగ్‌ లీడర్‌ ఉన్నారు. పార్టీకి వేవ్‌ వస్తే గెలుద్దామనుకునే అల్లాటప్పా లీడర్‌ కాదాయన. ఎందుకంటే పార్టీ జెండాని, మేనిఫెస్టోని నమ్ముకోలేదు కామారెడ్డి రెడ్డి సాబ్‌.

బీజేపీ కామారెడ్డిలో నిలబెట్టిన క్యాండేట్‌ పేరు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఆయన కొత్తగా జనంలోకి వెళ్లి నేను ఫలానా అని చెప్పుకోవాల్సిన పన్లేదు. ఎందుకంటే ఆయన అందరికీ చిరపరిచితుడు. ప్రజల్లోనే ఉన్న అసలు సిసలు నాయకుడు. ఒకప్పుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమాని. జిల్లాపరిషత్‌ మాజీ చైర్మన్‌. కామారెడ్డిలో సీఎం పోటీలో ఉన్నా కాటిపల్లి పేరు జనంలో నానుతోంది. నియోజకవర్గంలో దాదాపు 50 కోట్లపైనే ప్రజలకోసం ఖర్చుపెట్టిన నాయకుడిగా ఆయనకు పేరుంది. కామారెడ్డి నియోజకవర్గంలో దాదాపు ప్రతి ఊరూ ఏదో రూపంలో ఆయన సాయం పొందిందంటే అతిశయోక్తి కాదు.

గుడైనా, బడైనా, ఫంక్షన్‌ హాల్‌ అయినా, కమ్యూనిటీ హాల్‌ అయినా దాని వెనుక వెంకటరమణారెడ్డి సాయం ఉండి ఉంటుంది. ఎవరి చేతికీ డబ్బులివ్వడాయన. తనే పనులు చేయిస్తాడు. తన సొంత ఖర్చుతో ఎప్పటినుంచో దేవాలయాల జీర్ణోద్ధరణతో ఆయనంటే అందరికీ అభిమానం ఉంది. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో బాగా హైలెట్‌ అయ్యారు ఈ రెడ్డిగారు.బీజేపీనుంచి పోటీకి దిగుతున్న వెంకటరమణారెడ్డి పార్టీ మేనిఫెస్టో కోసం ఎదురుచూడలేదు. తనే వ్యక్తిగతంగా ఓ మేనిఫెస్టో ప్రకటించేశారు. ఏయే ఊళ్లలో ఏమేం పనులు చేస్తానో హామీ ఇచ్చారు.

రూ.150కోట్లు ఖర్చు అవుతాయన్న అంచనాతో కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రకటించిన వ్యక్తిగత మేనిఫెస్టో తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌. కామారెడ్డిలో ఉచితంగా మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టిస్తానని ప్రామిస్‌ చేశారు కాటిపల్లి. ప్రతీ మండల కేంద్రంలో ఓ ఉచిత జనరల్‌ హాస్పిటల్‌ కట్టించి అంబులెన్సులు అందుబాటులో ఉంచుతానని మాటిచ్చారు. ప్రతీ గ్రామంలో రైతులకోసం ఉచిత సీసీ కల్లాలు ఏర్పాటుచేస్తానంటున్నారు. ఆయనమాటిస్తే చేస్తారన్న నమ్మకం ప్రజలకు ఉంది. క్రెడిబులిటీ అంటే ఇదే. ఓడదాటాక బోడిమల్లన్న అనే నాయకులున్న ఈ రోజుల్లో కామారెడ్డి వెంకటరమణారెడ్డి  రోల్‌మోడల్‌.

Share this post

submit to reddit
scroll to top