వరల్డ్‌కప్‌లో కివీస్‌పై భారత్‌ విజయం

Shami-and-kohli.jpg

వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా అప్రతిహతంగా దూసుకెళ్తోంది. న్యూజిలాండ్‌ని ఓడించి వరుసగా ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో భారత జట్టు విజయ భేరి మోగించింది. 48 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. భారత విజయంలో విరాట్‌ కోహ్లి మరోసారి కీలక పాత్ర పోషించాడు.

104 బంతుల్లో 95 పరుగులతో విరాట్‌ కోహ్లి చెలరేగిపోయాడు. 49వ వన్డే సెంచరీ అవకాశాన్ని మిస్‌ అయినా టీమిండియాని గెలుపుబాటలో నడిపించాడు. విరాట్‌తో పాటు రవీంద్ర జడేజా 44 బంతుల్లో 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌ విజయంలో కీలకంగా నిలిచాడు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 46 పరుగులతో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ వన్డేల్లో అత్యంత వేగంగా 2000 పరుగుల మార్క్‌ను అందుకున్న బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటిదాకా 38 ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు ఆడిన గిల్‌ 2012 పరుగులు సాధించాడు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్‌గా వచ్చి చివరిదాకా క్రీజ్‌లో పాతుకుపోయిన డార్లీ మిచెల్‌ (130) సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు రచిన్‌ రవీంద్ర 75 పరుగులతో భారత్‌ ముందు ఇంగ్లాండ్‌ ఛాలెంజింగ్‌ టార్గెట్‌నే పెట్టినా మన జట్టు అలవోకగా ఆడేసింది. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్‌లోనే మరొకరు రనౌట్‌ అయ్యారు. కుల్దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లు తీసుకుంటే, సిరాజ్‌, బుమ్రా చెరో వికెట్‌ సాధించారు.

 

Share this post

submit to reddit
scroll to top