ఇంగ్లాండ్‌పై టీమిండియా అద్భుతవిజయం

teamindia1.jpg

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు అదరగొట్టేసింది. లక్నోలో ఇంగ్లాండ్‌ని వంద పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి నాకౌట్‌ బెర్త్‌ని కన్‌ఫం చేసుకుంది. ఇప్పటిదాకా ఓటమి అనేదే లేకుండా అప్రతిహిత విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఇంగ్లాడ్‌తో మ్యాచ్‌లో తన సత్తా చాటుకుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. మన బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది.

ఇంగ్లాండ్‌ జట్టులో ఎవ్వరూ భారీ స్కోర్‌ చేయలేకపోయారు. 27 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్ ఆ జట్టులో టాప్‌ స్కోరర్. జో రూట్, బెన్‌స్టోక్స్ పరుగులు చేయకుండానే పెవిలియన్‌ బాట పట్టారు. షమి 22పరుగులు ఇచ్చి 4వికెట్లు పడగొడితే… 32 పరుగులిచ్చిన బుమ్రా 3వికెట్లు తీసుకున్నాడు, కుల్‌దీప్ యాదవ్‌ రెండు వికెట్లు తీసుకుంటే జడేజా ఒక వికెట్‌ పడగొట్టాడు.

48 ఏళ్ల ప్రపంచకప్‌ చరిత్రలో మొదటిసారి రెండు జట్లలోని నెంబర్‌ 3 ఆటగాళ్లు పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. విరాట్‌కోహ్లి పరుగులేమీ చేయకుండా ఔట్‌ అయినా రోహిత్‌ శర్మ 87 పరుగులతో భారత్‌ జట్టు క్రీజ్‌లో చివరిబంతిదాకా నిలబడింది. రోహిత్‌శర్మతో పాటు కేఎల్‌ రాహుల్‌ 3 ఫోర్లతో 39 రన్స్‌ చేస్తే, సూర్యకుమార్‌ యాదవ్‌ నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 బంతుల్లో 49 పరుగులు చేశారు. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ మొదట్నించీ తడబడుతూ 23.1 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయింది.

Share this post

submit to reddit
scroll to top