ఎన్నికల ప్రణాళికలో చెప్పని అంశాలను సైతం అమలు చేసిన ఘనత తమదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ మేనిఫెస్టోని BRS అధినేత కేసీఆర్ ప్రకటించారు. అన్ని వర్గాలను ఆకర్షించేలా హామీలు ఇచ్చారు. 2014లో మేనిఫెస్టోని ముందుగానే విడుదల చేసిన గులాబీ పార్టీ.. 2018లో మాత్రం ఎన్నికలకు మూడురోజుల ముందు విడుదల చేసింది. ఈసారి మాత్రం 45 రోజుల ముందే మేనిఫెస్టోని ప్రకటించారు కేసీఆర్.
10శాతమే చెప్పి 90శాతం అమలు
ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి
దళితబంధు కొనసాగింపు
మైనారిటీలకు బడ్జెట్ పెంపు
డిగ్రీకాలేజీలుగా మైనారిటీ జూనియర్ కాలేజీలు
గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలు
ఉద్దీపనలతో పాత పాలసీలన్నీ అమలు
కులవృత్తులకు ఆర్థిక సాయం
ఆరేడు నెలల్లోనే ఈ కింది హామల అమలు
రైతుబంధుతో పాటు రైతు భీమా పథకం
లక్ష కుటుంబాలకు రూ.5లక్షల సాయం
కేసీఆర్ భీమా- ప్రతీ ఇంటికీ ధీమా
93లక్షల కుటుంబాలకు భీమాతో మేలు
100 శాతం ప్రభుత్వమే ప్రీమియం చెల్లింపు
రూ.3,600-4,000 కోట్లు ఖర్చయ్యే అవకాశం
ఎల్‌ఐసీ ద్వారా బీమా పథకం అమలు
తెలంగాణ అన్నపూర్ణ
ప్రతీ రేషన్‌కార్డు హోల్టర్‌కి సన్నబియ్యం
మరింత ‘ఆసరా’
పింఛన్ల పథకం రూ.5,000కు పెంపు
దశలవారీగా 5 ఏళ్లలో పెంపు వర్తింపు
వికలాంగుల పింఛన్ రూ.4వేలనుంచి రూ.6వేలకు పెంపు
రైతుబంధు రూ.16వేలకు పెంపు
దశలవారీగా పెంపుదల వర్తింపు
అర్హులైన వారికి రూ.400కే సిలిండర్
అక్రిడేటెడ్ జర్నలిస్టులకు కూడా సబ్సిడీ గ్యాస్
ఆరోగ్యశ్రీ గరిష్ఠపరిమితి రూ.15లక్షలకు పెంపు
హైదరాబాద్‌లో మరో లక్ష బెడ్రూం ఇళ్లు
ఇళ్లస్థలాలు లేనివారికి పేదలకు జాగాలు
అగ్రవర్ణాల్లోని పేదలకోసం 100 గురుకులాలు