తెలంగాణ కాంగ్రెస్‌ ఫస్ట్‌ లిస్ట్‌- 55మంది ప్రకటన

అలకలూ ఆగ్రహాలు, కసరత్తులు మరమ్మతుల తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ ఫస్ట్‌ లిస్ట్‌ రిలీజైంది. వీటిలో చాలాపేర్లు ముందే ఊహించినా, కొన్ని విచిత్రాలు కూడా జరిగాయి. ఖమ్మంజిల్లాలో కాంగ్రెస్‌లోకొచ్చిన కీలకమైన ఇద్దరు నేతల పేర్లుకూడా ఫస్ట్‌ లిస్టులో లేవు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్లు తొలి జాబితాలో లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

కాంగ్రెస్‌ తొలిజాబితా ప్రకటనకు ముందురోజే తుమ్మలతోఅగ్రనేతలు మాట్లాడారు. రెడ్డి, కమ్మ సామాజికవర్గాల ఈక్వేషన్‌లో ఆ ఇద్దరి సీట్లు మారిపోయాయి. మొదట పాలేరు అనుకున్న తుమ్మల ఖమ్మంనుంచి, పొంగులేటి పాలేరునుంచి పోటీచేస్తున్నట్లు సంకేతాలిచ్చారు. కానీ ఫస్ట్‌ లిస్ట్‌లో ఆ ఇద్దరి పేర్లూ లేకపోవటంతో ఖమ్మం సమీకరణాలు ఇంకా కొలిక్కిరాలేదనే భావించాలి. కాంగ్రెస్‌తో సంప్రదింపుల్లో పురోగతి లేకపోవటంతో 119 నియోజకవర్గాల్లో పోటీచేస్తున్నట్లు వైఎస్‌ షర్మిల ప్రకటించారు. ఆమె ఎపిసోడ్‌ కోసమే ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టారా లేదంటే కమ్యూనిస్టుల సీట్లతో పాటు ప్రకటిస్తారా అన్నది చూడాలి.

కాంగ్రెస్‌ ఫస్ట్‌ లిస్టులో ఇద్దరు నేతల కుటుంబాలకు రెండేసి సీట్లు దక్కాయి. మైనంపల్లి హన్మంతరావుకు మల్కాజ్‌గిరి, ఆయన కొడుకు రోహిత్‌రావుకి మెదక్‌ టికెట్లు ప్రకటించారు. అలాగే సిట్టింగ్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ హుజూర్‌నగర్‌ నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన సతీమణి పద్మావతి రెడ్డికి కోదాడ టికెట్‌ కేటాయించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొడంగల్‌ నుంచి, మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండనుంచి పోటీ చేయనున్నారు.

  • కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా
    బెల్లంపల్లి (ఎస్సీ) – గడ్డం వినోద్‌
    నిర్మల్‌ – శ్రీహరి రావు
    మంచిర్యాల – ప్రేమ్‌సాగర్‌ రావు
    బోధన్‌ – సుదర్శన్‌ రెడ్డి
    ఆర్మూర్‌ – ప్రొద్దుటూరి వినయ్‌ కుమార్‌ రెడ్డి
    బాల్కొండ – సునీల్‌ కుమార్‌ ముత్యాల
    జగిత్యాల – జీవన్‌ రెడ్డి
    రామగుండం – రాజ్‌ ఠాకూర్‌
    మంథని – దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
    పెద్దపల్లి – చింతకుంట విజయ్‌ రమణారావు
    వేములవాడ – ఆది శ్రీనివాస్‌
    ధర్మపురి (ఎస్సీ) – లక్ష్మణ్‌ కుమార్‌
    మానకొండూరు (ఎస్సీ) – కవ్వంపల్లి సత్యనారాయణ
    మెదక్‌ – మైనంపల్లి రోహిత్‌ రావు
    సంగారెడ్డి – జగ్గారెడ్డి
    గజ్వేల్‌ – తూముకుంట నర్సారెడ్డి
    అందోల్‌ (ఎస్సీ) – దామోదర రాజనర్సింహ
    జహీరాబాద్‌ (ఎస్సీ) – ఆగం చంద్రశేఖర్‌
    మేడ్చల్‌ – తోటకూర వజ్రేశ్‌ యాదవ్‌
    మల్కాజిగిరి – మైనంపల్లి హన్మంతరావు
    కుత్బుల్లాపూర్ – కొలన్‌ హన్మంత్‌ రెడ్డి
    పరిగి – టి. రామ్మోహన్‌ రెడ్డి
    ఉప్పల్‌ – పరమేశ్వర్‌ రెడ్డి
    చేవెళ్ల (ఎస్సీ) – భీమ్‌భరత్‌
    వికారాబాద్‌ – గడ్డం ప్రసాద్‌ కుమార్‌
    ముషీరాబాద్‌ – అంజన్‌కుమార్‌ యాదవ్‌
    సనత్‌నగర్‌ – కోట నీలిమ
    మలక్‌పేట – షేక్‌ అక్బర్‌
    నాంపల్లి – ఫిరోజ్‌ ఖాన్‌
    కార్వాన్‌ – ఉస్మాన్‌ బిన్‌ మహ్మద్‌ అల్‌హజ్రి
    గోషామహల్‌ – మొగిలి సునీత
    చాంద్రయణగుట్ట – బోయ నగేశ్‌ (నరేశ్‌)
    యాకుత్‌పురా- కె. రవిరాజు
    బహదూర్‌పురా- రాజేశ్‌ కుమార్‌ పులిపాటి
    సికింద్రాబాద్‌ – ఎ.సంతోష్‌ కుమార్‌
    కొడంగల్‌ – రేవంత్‌ రెడ్డి
    గద్వాల – సరితా తిరుపతయ్య
    నాగర్‌కర్నూల్‌ – కె. రాజేశ్‌ రెడ్డి
    కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణ్‌ రెడ్డి
    కొల్లాపూర్‌ – జూపల్లి కృష్ణారావు
    షాద్‌నగర్‌ – కె. శంకరయ్య
    అలంపూర్‌ (ఎస్సీ)- సంపత్‌ కుమార్‌
    అచ్చంపేట్‌(ఎస్సీ) – సీహెచ్‌ వంశీకృష్ణ
    నాగార్జునసాగర్‌ – కుందూరు జయవీర్‌
    హుజూర్‌నగర్‌ – ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
    కోదాడ – పద్మావతి రెడ్డి
    నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
    ఆలేరు – బీర్ల ఐలయ్య
    నకిరేకల్‌ (ఎస్సీ)- వేముల వీరేశం
    స్టేషన్‌ ఘన్‌పూర్‌ (ఎస్సీ) – సింగాపురం ఇందిర
    నర్సంపేట – దొంతి మాధవ్‌ రెడ్డి
    భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ రావు
    మధిర (ఎస్సీ)- మల్లు భట్టి విక్రమార్క
    ములుగు (ఎస్టీ) – సీతక్క
    భద్రాచలం(ఎస్టీ) – పొదెం వీరయ్య

Share this post

submit to reddit
scroll to top