నిప్పులేందే పొగరాదు. సిన్మా ఇండస్ట్రీలో ఆ ఛాన్స్ అస్సలే లేదు. సినీ పరిశ్రమలో రాణించాలంటే, నాలుగు అవకాశాలు రావాలంటే వెండితెరపై వెలగాలనుకునే అమ్మాయిలు రాజీపడాలన్న అపవాదు ఎప్పట్నించో ఉంది. కాస్టింగ్‌కౌచ్ బాధితుల్లో వందకు ఒకరిద్దరు బయటికొస్తున్నారేమో అంతే. ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ సమస్య అంతగా లేదేమోకానీ ఒకప్పుడు నాకేంటని అడిగే బాపతులు బాగానే ఉండేవాళ్లు. తమిళ బిగ్‌బాస్ షోలో ఒకప్పటి నటి విచిత్ర చేసిన సంచలన కామెంట్స్ టాలీవుడ్‌ని షేక్ చేస్తున్నాయి. ఎవరా ప్రబుద్ధుడు అని ఆరాతీస్తే అన్ని వేళ్లూ మన నటసింహంవైపే చూపిస్తున్నాయి.
నన్ను ఓ హీరో ఇబ్బందిపెట్టాడంటూ పేరు చెప్పకుండానే మ్యాటరంతా చెప్పేసింది విచిత్ర. అప్పట్లో ఆమె పేరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే రాత్రికి రూముకి వచ్చేయమన్నాడట ఆ హీరో. తను వెళ్లకపోయేసరికి మరుసటిరోజునుంచీ వేధించారన్నది విచిత్ర ఆరోపణ. రాత్రి తాగొచ్చి ఆమె గది తలుపులు కొట్టేవారు. దాంతో సిన్మాలంటేనే విచిత్రకి వైరాగ్యమొచ్చేసిందట. తెలుగులో విచిత్ర చేసిన ఒకే ఒక సిన్మా భలేవాడివి బాసూ. ఆ సిన్మా హీరో బాలయ్య. ఎప్పుడో 20ఏళ్లు అయిపోయుండొచ్చుగానీ విచిత్ర మాత్రం ఆ చేదు అనుభవాన్ని మర్చిపోలేదు. బిగ్‌బాస్‌లో ఆమె అప్పటి అనుభవాన్నిచెప్పటంతో హమ్మ బాలయ్యా అంటున్నారంతా.
బాలకృష్ణ మీద గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఓ తెలుగు హీరో తనని వేధించాడని గతంలో బాలీవుడ్ నటి రాధికాఆప్టే కూడా ఆరోపణలు చేసింది. టాలీవుడ్ అని చెప్పలేదుగానీ ఓ సౌత్‌హీరో టార్చర్ పెట్టాడని చెప్పుకొచ్చింది రాధికాఆప్టే. ఆ హీరోయిన్ బాలకృష్ణతో కలిసి లెజెండ్ సినిమాలో నటించింది. దీంతో సౌత్‌లో అంత మగాడెవరయ్యా అని ఆరాతీస్తే బాలయ్యమీదే అందరి డౌట్ మళ్లింది. ఇప్పుడు వయసు మీదపడిందని కాస్త కుదురుగా ఉన్నాడేమోగానీ బాలకృష్ణమీద ఇలాంటి గాసిప్స్ చాలానే ఉన్నాయి. ఏదో సిన్మాలో తన డైలాగ్ ఒకటుంది. నాకెవరు ఎదురొచ్చినా వాళ్లకే రిస్కు.. నేను ఎవరికి ఎదురెళ్లినా వాళ్లకే రిస్కని. అనుమానమే లేదు.. బాలయ్యకి ఎదురుపడితే హీరోయిన్లకు పెద్ద రిస్కే!