అమలాపాల్ పెళ్లిపీటలెక్కింది. అదేంటీ అప్పుడెప్పుడో ఎక్కినట్లు గుర్తే అంటారా. అవును తనకు ఎప్పుడో పెళ్లయింది. కానీ ఆరేళ్లక్రితమే ఆ పెళ్లి పెటాకులైంది. ఇప్పుడు తను మరో వ్యక్తితో జీవితాన్ని పంచుకుంది. తన స్నేహితుడైన జగత్ దేశాయ్‌ని అమలాపాల్ పెళ్లాడింది. కేరళలోని కొచ్చిలో ఓ హోటల్‌లో ఇద్దరూ ఒక్కటయ్యారు.
అమలాపాల్‌తో పెళ్లి ఫొటోలను జగత్ సోషల్ మీడియాలో షేర్‌చేశారు. ‘రెండు ఆత్మలు..ఒక విధి.. ఆమె చేతిలో చేయి వేసి జీవితాంతం ఇలానే నడుస్తా’ అన్న కామెంట్‌తో ఉన్న పోస్ట్‌పై సినీ ప్రముఖులు, నెటిజన్లు స్పందించారు. రెండు కుటుంబాల సభ్యులు, కొందరు ముఖ్య అతిధులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.
అక్టోబరు 26 అమలాపాల్ బర్త్‌డే. అదేరోజు ఆమెకు జగత్ ప్రపోజ్ చేశారు. ఇన్‌స్టా వేదికగా షేర్‌చేసుకున్న ఆ దృశ్యాలపై ఇండస్ట్రీలో చర్చ సాగింది. పదిరోజుల్లోపే డైరెక్ట్‌గా పెళ్లి ఫొటోలతో జగత్ అందరినీ ఆశ్చర్యపరిచారు. కేరళకు చెందిన అమలాపాల్ కెరీర్‌లో దూసుకుపోతున్న సమయంలోనే 2014లో డైరెక్టర్ ఎ.ఎల్. విజయ్‌తో ఆమె పెళ్లి జరిగింది. అయితే మనస్పర్థలు రావటంతో పరస్పర అంగీకారంతో 2017లో వీరిద్దరూ విడిపోయారు.