భారత్‌కు బాహుబలి విమానం వచ్చేసింది. స్పెయిన్‌లో తయారైన C-295 మిలటరీ విమానం అందుబాటులోకి వచ్చింది. ఎన్నో ప్రత్యేకతలున్న C-295 రెండో విమానాన్ని 2024 మే లో భారత్‌కు తీసుకొస్తారు. స్పెయిన్ నుంచి ఈ తరహా 56 విమానాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది. అక్కడే 16 విమానాలను తయారు చేస్తారు. మిగతా విమానాలను స్పెయిన్ ఎయిర్‌బస్ కంపెనీ సహకారంతో గుజరాత్‌లోని వడోదరలో తయారు చేస్తారు.
అత్యవసర సమయాల్లో C-295 విమానాలు ఎంతో ఉపయోగపడతాయి. సైనికులు, యుద్దసామగ్రి తరలింపుకు ఈ విమానాలు అనువుగా ఉంటాయి. ఈ విమానం ల్యాండ్ కావడానికి , టేకాఫ్ కావడానికి పెద్ద రన్‌వే అవసరం లేదు. పర్వత ప్రాంతాల్లో కూడా సులభంగా దీన్ని దించొచ్చు.11 గంటల పాటు నిరంతరంగా ప్రయాణం చేసే C-295 విమానం 7,050 కిలోల బరువును ఈజీగా మోసుకెళ్తుంది.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో హిండన్ ఎయిర్‌బేస్‌లో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేర్చారు. గత ఏడాది అక్టోబరులో ప్రధాని నరేంద్రమోడీ ఈ విమానాల తయారీ కేంద్రానికి వడోదరలో శంకుస్థాపన చేశారు. 5 నుంచి 10 టన్నుల బరువుని మోసుకెళ్లే C295 విమానం 71 మంది సైనికులను లేదా 50 మంది పారాట్రూపర్లను అవసరమైన ప్రాంతాలకు తరలించగలదు.