రోజా, రజనీ, తమ్మినేనీ.. అయ్యోపాపం!

aaraa-masthan-exit-polls.jpg

ఎన్నికల ఫలితాల అంచనాలో వాస్తవాలకు దగ్గరగా ఉండే ఆరా మస్తాన్‌ బాంబు పేల్చారు. ఆయన అంచనాల ప్రకారం ఏపీలో కొందరు మంత్రులు ఓడిపోతారన్నారు. మాకు అడ్డేలేదని తొడగొట్టే ముఖ్యనేతలు కూడా వారిలో ఉన్నారు. ఆరా సంస్థ ఎగ్జిట్‌పోల్‌ అంచనాల ప్రకారం సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్‌, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ, విడదల రజనీ, ఆదిమూలం సురేష్‌, ఉషశ్రీ చరణ్‌, ఆర్కే రోజా, స్పీకర్ తమ్మినేని ఈసారి గట్టెక్కడం కష్టమే.

మంత్రులు ధర్మాన, జోగి రమేష్‌, అంబటి రాంబాబు తమ నియోజకవర్గాల్లో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారని ఆరా సంస్థ అంచనావేసింది. ఇక మంత్రులు బొత్స, కాకాణి, పెద్దిరెడ్డి, రాజన్నదొర, విశ్వరూప్‌, దాడిశెట్టి రాజా, తానేటి వనిత, మేరుగ నాగార్జున, ఆంజాద్‌ బాషా గెలుస్తారని ఆరా సర్వే సంస్థ చెబుతోంది.

టీడీపీకి తీపికబురేంటంటే కుప్పంలో గట్టిపోటీ తప్పదనుకున్న చంద్రబాబు, పిఠాపురంనుంచి పోటీచేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, హిందూపురంలో బాలకృష్ణ, మంగళగిరిలో నారా లోకేష్‌లకే గెలుపు అవకాశాలున్నాయి.మొదటిసారి ప్రత్యక ఎన్నికల బరిలోకి దిగిన సుజనాచౌదరి, సీఎం రమేష్‌లకీ గెలుపు అవకాశాలున్నాయన్న అంచనాలు టీడీపీ కూటమికి పెద్ద రిలీఫ్‌.

Share this post

submit to reddit
scroll to top