జాంబీ వైర‌స్‌.. వ‌చ్చిందంటే బ‌తుకు బ‌స్టాండే!

arcitic-jambi-virus.jpg

నడుస్తూ నడూస్తూనే కళ్లు తిరిగి పడిపోతారు.. పిచ్చెక్కినట్టు వింత వింతగా ప్రవర్తిస్తారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా స్థాణువుల్లా మారిపోతారు. గట్టిగా అరుస్తారు.. ఎదుటివారిపై దాడి చేస్తారు. జాంబీ వైరస్‌ సోకితే మ‌నుషులు ఇలాగే చిత్రవిచిత్రంగా మారిపోతార‌ని ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్టేశాయి. అయితే ఇప్ప‌టిదాకా ఫిక్షనల్‌ స్టోరీగా ఉన్న జాంబీ వైరస్ తొందర్లోనే నిజం కాబోతుందనే శాస్త్రవేత్తల హెచ్చ‌రిక‌ల్లో ప్ర‌పంచ‌దేశాల్లో ద‌డ పుట్టిస్తున్నాయి.

కరోనా వచ్చిన తర్వాత వైరస్‌ అనే మాట వినగానే జనం ఇప్ప‌టికీ వ‌ణికిపోతున్నారు. కంటికి కనిపించని కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికించింది. వేల ప్రాణాలుతీసింది. మృత్యువు కౌగిలి నుంచి తప్పించుకున్న‌వారు కొన్నాళ్ల‌కే ఆ భ‌యాన్ని మ‌రిచిపోయారు. కరోనా రక్కసి కోరల నుంచి తప్పించుకున్నామని ఆనంద పడుతున్నారు. ఇప్పుడు అందరూ షాక్‌ అయ్యే న్యూస్‌ తెరపైకి వచ్చింది. కొత్తగా జాంబీ వైరస్‌ భయాందోళనలు రేపుతోంది. 48 వేల సంవత్సరాలుగా ఆర్కిటిక్ మంచు కింద కప్పబడిన జాంబీ వైరస్ ఇప్పుడు బయటికొచ్చే ప్రమాదం ఉందని ఎయిక్స్ మార్సిల్లే యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ జాంబీ వైరస్ ప్ర‌బ‌లిందంటే పోలియో తరహాలో జనం అనారోగ్యం బారిన పడతారని.. మానవాళికి ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు వార్నింగ్‌ ఇస్తున్నారు.

గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా ఆర్కిటిక్‌ మంచు వేగంగా కరిగిపోతోంద‌ని పర్యావరణవేత్తలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్కిటిక్‌ మంచు కరిగిపోవడం వల్ల వచ్చే ప్రమాదాలపై పరిశోధన చేపట్టిన ఎయిక్స్‌ మార్సిల్లే పరిశోధనలో షాకింగ్‌ నిజాలు వెలుగులోకి వచ్చాయి. వేల ఏళ్ల క్రితం ఆర్కిటిక్‌ మంచులో గడ్డకట్టుకుపోయిన ప్రమాదకరమైన వైరస్‌లు ఇంకా సజీవంగానే ఉన్నాయ‌ని వారి పరిశోధనల్లో వెల్లడైంది. భూతాపం కారణంగా మంచు కరిగిపోవడంతో.. ఇప్పుడు ఆ వైరస్‌లు బయటకు వస్తున్నాయని తెలిసింది. రష్యాలోని సైబీరియన్‌ ప్రాంతంలో కరుగుతున్న మంచు నమూనాలను పరిశీలించిన సైంటిస్టులు.. 13 కొత్త తరహా వైరస్‌లను 2022లో గుర్తించారు. వీటిపై తాజాగా పరిశోధనలు జరిపిన సైంటిస్టులు.. వీటిలో 48,500 ఏళ్ల క్రితం గడ్డకట్టుకుపోయిన జాంబీ తరహా వైరస్‌లు కూడా ఉన్నాయని గుర్తించారు.

వేల‌సంవ‌త్స‌రాల‌నుంచీ వైరస్‌లు ఇంకా సజీవంగానే ఉన్నాయ‌న్న వార్త ప్ర‌పంచాన్నిభ‌య‌పెడుతోంది. కొన్ని వైరస్‌లు వేల సంవత్సరాలు మంచులో గడ్డకట్టి సజీవంగానే ఉంటాయని.. జాంబీ తరహా వైరస్‌లు ఇంకా మంచులో సజీవంగా ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు ఆ మంచు కరిగి నీళ్లుగా మారి.. ఆ నీళ్ల ద్వారా వైరస్ జనంలోకి వస్తే.. పెను ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. మంచు కరగటం ద్వారా బయటికొచ్చే వైరస్ వాతావరణంలో కలిసిపోయి.. గాలి ద్వారా వ్యాపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. జాంబీ వైరస్‌లు విజృంభిస్తే కరోనా కంటే పెను విలయం తప్పదని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. మంచు ఖండంలోని ఇంధన నిక్షేపాల కోసం వేల అడుగుల లోతుకు డ్రిల్లింగ్ చేస్తున్నారని.. దీని వల్ల కూడా జాంబీ వైరస్ లు బయటికొచ్చే ప్రమాదం ఉందని సైంటిస్టులు వార్న్ చేస్తున్నారు. కరోనా మిగిల్చిన విషాదం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే.. మరో డేంజరస్‌ వైరస్‌ పంజా విసిరేందుకు రెడీ అవుతోందనే వార్తలు ప్రపంచాన్ని హడలెత్తిస్తున్నాయి.

Share this post

submit to reddit
scroll to top