నారీనారీ నడుమ రాజ్‌తరుణ్‌!

rajtarun-traingle-love.jpg

రీల్‌లైఫ్‌లో తెరమీద బొమ్మలేం పెద్దగా ఆడలేదు. కానీ రియల్‌ లైఫ్‌లో మాత్రం ఆ హీరోగారి ప్రేమకావ్యం జనం నోళ్లలో నానుతోంది. నారీనారీ నడుమ మురారి అని చెప్పలేంగానీ భయపడి పరారీ అయితే కాలేదు రాజ్‌తరుణ్‌. ఆమె ఫిర్యాదు చేస్తుందని ఈవిడకు తెలుసు. ఈమె కంప్లయింట్‌ ఇస్తుందని ఆవిడకు తెలుసు. ఆ ఇద్దరి పరస్పర ఫిర్యాదుల సంగతి ఆయనకు ముందే తెలుసు. 11 ఏళ్ల సహజీవనం పోలీస్‌స్టేషన్ మెట్లు తొక్కింది. రాజ్‌తరుణ్‌ సహజీవనం మొహం చాటేశాడన్నది లావణ్య కంప్లయింట్‌. మాల్వీ మల్హోత్రా మోజులపడి తనను మోసంచేశాడంటోంది లావణ్య. డ్రగ్స్‌కి అలవాటు పడ్డ లావణ్య టార్చర్‌ భరించలేకే ఆమెకు దూరమయ్యాననేది రాజ్‌ తరుణ్‌ వెర్షన్‌.

పదకొండేళ్లు కలిసున్న రాజ్‌ తరుణ్‌ కటీఫ్‌ చెప్పడానికి కారణం మాల్వీ మల్హోత్రా అనేది లావణ్య ఆరోపణ. నార్సింగి పోలీసులకు ఫిర్యాదుకూడా చేశారామె. మాల్వీ మల్హోత్రాతో పాటు ఆమె కుటుంబంనుంచి తనకు ప్రాణహాని ఉందంటోంది లావణ్య. ఆరోపణలు సరే ఆధారాలు ఏవని పోలీసులు అడగటంతో సహజీవనం కాదు తాను రాజ్‌తరుణ్‌ సహధర్మచారిణినని కొత్త వెర్షన్‌ అందుకుందామె. అబ్బే పెళ్లా పాడా.. జస్ట్‌ రిలేషన్‌షిప్‌ అంటున్నాడు లవర్‌బాయ్‌. ఆ ముచ్చటకూడా తెగిపోయి దాదాపు ఏడేళ్లయిందని రాజ్‌తరుణ్‌ చెబుతుంటే.. లేదు లేదు మేం పెళ్లి కూడా చేసుకున్నామంటోంది లావణ్య.

రాజ్‌తరుణ్‌ కంటే మాల్వీ మల్హోత్రాపైనే ఎక్కువగా ఆరోపణలు చేస్తోంది లావణ్య. తమ మధ్య గొడవలకు మాల్వీనే కారణమంటోంది. తోటి నటుడు అయినంతమాత్రాన రిలేషన్‌ అంటగట్టేస్తావా అంటూ మాల్వీ మల్హోత్రా ఫైర్‌ అవుతోంది. నిరాధార ఆరోపణలు చేసిన లావణ్యపై ఆమె పోలీసులకు కంప్లయింట్‌ చేసింది. చూట్టానికి అమాయకంగా కనిపిస్తాడుగానీ మాన్వీతోనే కాదు మరికొందరితో కూడా రాజ్‌తరుణ్‌కి ఎఫైర్స్‌ ఉన్నాయంటోంది లావణ్య. తనతో పెళ్లి విషయం తెలిశాక కొందరు అతనికి దూరమయ్యారంటోంది. ఇప్పటికీ తన మనసంతా రాజ్‌ తరుణే అంటూ ప్రేమరాగాలు తీస్తోంది లావణ్య.

మనసులో ఉన్నా, గుండెల్లో గుడి కట్టుకున్నా ఇక ఈ బంధం అతకదంటున్నాడు రాజ్‌తరుణ్‌. ఏదయినా లీగల్‌గానే తేల్చుకుంటానంటున్నాడు. ఖర్చులకు అడిగితే ఏదన్నా సాయం చేస్తానే తప్ప కలిసి ఉండే ముచ్చటే లేదన్నది రాజ్‌తరుణ్‌ మాట. కానీ రాజ్‌తరుణ్‌ అనుకున్నంత అమాయకుడు కాదని లావణ్య బయటపెట్టిన ఆధారాలతో తేలిపోయింది. సహజీవనం, అబార్హన్‌కి పక్కా ఎవిడెన్సులు పోలీసులకు ఇచ్చింది లావణ్య. అరెస్ట్‌చేసేదాకా తెచ్చుకుంటాడో, అందరి ముందు మూడుముళ్లు వేస్తాడో రాజ్‌తరుణ్‌ డిసైడ్‌ చేసుకోవాల్సిందే.

Share this post

submit to reddit
scroll to top