షేక్ అవుతున్న అస‌ద్ కంచుకోట‌!

Owaisis-AIMIM-looks-invincible-in-its-old-Hyderabad-strongholds.jpg

అస‌దుద్దీన్ అయితే ఏంటి? అవును ఓల్డ్‌సిటీనే.. సో వాట్‌? అబ్బే ఆ కంచుకోట‌ని ట‌చ్‌కూడా చేయ‌లేం అనుకునేవి పార్టీలు. క‌టౌట్ చూసి ఓట్లు నొక్కేస్తార‌న్న ధీమాతో ఇన్నేళ్లూ ఉంది ప‌తంగి పార్టీ. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. ట‌చ్ చేసి చూడు అంటూ రెచ్చిపోయే అస‌దుద్దీన్ ఒవైసీకి ఫ‌స్ట్ టైమ్ చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. ఎందుకంటే ఈసారి హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పేలా లేదు. ఎంఐఎంకి కంచుకోటగా ఉన్న ఈ సీటుపై బీజేపీ, కాంగ్రెస్‌ గట్టిగానే గురిపెట్టాయి. కాంగ్రెస్ నుంచి ఇలాంటి ఛాలెంజ్ వ‌స్తుంద‌ని ఎంఐఎం చీఫ్ ఊహించ‌లేదు. అందుకే ప్రచారంలో ఆ పార్టీనే అస‌దుద్దీన్ ప్ర‌ధానంగా టార్గెట్ చేస్తున్నారు.

madhavilatha

మజ్లిస్‌కి కంచుకోటగా ఉన్న హైదరాబాద్‌ నియోజకవర్గంపై రెండు ప్రధాన జాతీయ పార్టీలు కన్నేశాయి. ఇప్పటికే బీజేపీ ఇక్కడ తన అభ్యర్థిని ప్రకటించింది. విరంచి హాస్పిట‌ల్ అధినేత మాధ‌వీల‌త‌ని క‌మ‌లంపార్టీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి పాత‌బ‌స్తీ ప‌హిల్వాన్‌కి స‌వాల్ విసిరింది. మజ్లిస్ ఎంపీగా దేశమంతా సుపరిచితుడైన అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి గెలుపు లాంఛనమే అన్న ధీమాతో ఉన్నారు. 8ల‌క్ష‌ల‌మంది హిందువులు ఓటేస్తే బీజేపీ సునాయాసంగా గెలుస్తుందంటూ కొత్త వాద‌న మొద‌లుపెట్టారు ఆ పార్టీమ‌హిళా అభ్య‌ర్థి. ఆ పార్టీకి ఎలాగూ సంప్రదాయిక ఓటర్లున్నారు. మ‌హిళా అభ్య‌ర్థికావ‌డం, ఓల్డ్‌సిటీతో ఆమెకు అనుబంధం ఉండ‌టం బీజేపీకి ఇంకాస్త క‌లిసొచ్చే అంశం. అయితే అదే స‌మ‌యంలో వీళ్లిద్దరి మధ్యలోకి కాంగ్రెస్‌ ఓ బలమైన అభ్యర్థిని తీసుకురాబోతోంది. అది కూడా ముస్లిం అభ్యర్థి కావడం మజ్లిస్ అధినేత‌కు మింగుడుపడడం లేదు.

కాంగ్రెస్ నుంచి హైద‌రాబాద్ ఎంపీ అభ్య‌ర్థిగా మస్కతీ డెయిరీ ప్రొడక్ట్స్‌ అధినేత అలీ మస్కతీ పోటీ దాదాపు ఖాయమైంది. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన అలీ మస్కతీ.. ఎంఐఎంపై గురిపెట్టారు. దీంతో పాతబస్తీలో ఎలక్షన్‌ హీట్‌ మొదలైంది. మ‌స్క‌తీ ఎంట్రీతో అస‌దుద్దీన్ కాంగ్రెస్‌పై మండిప‌డుతున్నారు. రాజకీయంగా ఏమైనా చేయండి ధైర్యంగా ఎదుర్కొంటా.. అంతే కానీ వ్యాపారాల్లో సంపాదించిన కోట్ల సొమ్ముతో అనైతిక రాజకీయాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్ర‌చారంలో హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు. హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో అసదుద్దీన్‌కి ఇన్నేళ్లుగా బీజేపీ అభ్యర్థులనుంచే ప్ర‌ధాన పోటీ ఉండేది. అయితే ఈ సారి కాంగ్రెస్‌ పార్టీ కూడా సీరియ‌స్ ఫైట్‌కి సిద్ధ‌మైంది. ఇప్పటికే అలీ మస్కతీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పాతబస్తీలో ఏకఛత్రాధిపత్యం నడిపిన అసద్‌కు.. ఇన్నేళ్లూ బీజేపీ నుంచే పోటీ ఉంటే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన ప్రత్యర్థిని రంగంలోకి దించడం ఆసక్తి కరంగా మారింది.

 

Share this post

submit to reddit
scroll to top