ఓరి నీ వేషాలో.. నవదీప్‌ డ్రగ్స్‌ కహానీ!

hero-navadeep-drugs-case-e1697348078147.jpg

దమ్మారో దమ్‌ అంటూ ఎక్కడ డ్రగ్స్‌ దొరికినా టాలీవుడ్‌ డొంక కదులుతోంది. హైదరాబాద్‌ మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో సినీ ఇండస్ట్రీ లింకులు బయటికొస్తున్నాయి. తాజాగా మాదాపుర్‌ డ్రగ్స్‌ కేసులో కూడా వివాదాస్పద నటుడు నవదీప్‌ పేరు గుప్పుమంటోంది. మామూలుగానే మనోడు అదో టైపు. ఓ పట్టాన ఎవరికీ చిక్కడు దొరకడు. తన పేరు బయటికొచ్చినా నవదీప్‌ పోలీసులతో దాగుడుమూతలు ఆడుతున్నాడు. టెక్నికల్‌గా దొరక్కుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. హైకోర్టును ఆశ్రయించి నవీన్‌ మొదట ఊరటపొందినా.. ఇప్పుడు న్యాయస్థానం అతనికి గట్టి షాకే ఇచ్చింది.

పోలీస్‌ విచారణకు హాజరు కావాల్సిందేనని నవదీప్‌కి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అతనికి 41-A కింద నోటీసులు ఇవ్వాలని పోలీసులకు తెలిపింది. నవదీప్‌పై డ్రగ్స్‌ ఆరోపణలు ఇవాళ కొత్తేం కాదు. గతంలోనూ అతనిపై అనుమానాలున్నాయి. ఆరోపణలొచ్చాయి. హైకోర్టు ఆదేశాలతో నవదీప్‌నుంచి నిజాలు కక్కించే పనిలో ఉన్నారు పోలీసులు. కేసు దర్యాప్తులో సహకరించకపోతే అరెస్ట్‌ చేస్తామని నవదీప్‌ని హెచ్చరించారు. నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు పోలీసులు.

డ్రగ్స్ కేసులో మొదట్నించీ నవదీప్ వ్యవహారంలో హైడ్రామా కొనసాగింది. మాదాపూర్ డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చినప్పట్నించీ నవదీప్ పేరు వినిపిస్తోంది. ఈ కేసులో అరెస్టయిన రామ్‌చంద్‌ అనే నిందితుడికి నవదీప్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. రామ్‌చంద్ ఫోన్‌లో నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు కొన్ని ఆధారాలను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌ సీపీ ప్రెస్‌మీట్‌లో తన పేరు ప్రస్తావించినా అది తాను కాదని నవదీప్‌ మొదట బుకాయించాడు. మర్నాడే పోలీసులు అంతని ఇంట్లో సోదాలు చేశారు. ఆ టైంలో ఇంట్లో లేని నవదీప్‌ వెంటనే హైకోర్టును ఆశ్రయించాడు. న్యాయపరమైన రక్షణలేకపోవటంతో ఈసారి నవదీప్‌ అడ్డంగా బుక్కయ్యేలా ఉన్నాడు.

హీరో నవదీప్‌ని విచారిస్తే సినీ పరిశ్రమ మత్తు మూలాలు బయటికి వస్తాయని భావిస్తున్నారు. డ్రగ్స్ కొనుగోలుతో పాటు ఇండస్ట్రీకి చెందిన చాలామందితో శివారు ప్రాంతాలు, గోవాలో తరచుగా జరుగుతున్న పార్టీల్లో నవదీప్‌ పాత్రపై పోలీసులు కూపీ లాగుతున్నారు. సిన్మా ఇండస్ట్రీలో ఎప్పుడు డ్రగ్స్ తెరపైకొచ్చినా మొదట వినిపించే పేరు హీరో నవదీప్. 2017నుంచీ అదే జరుగుతోంది. స్మార్ట్ పబ్ ఓనర్ తరచుగా డ్రగ్స్ పార్టీలు నిర్వహించేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆర్నెల్లుగా ఆ పబ్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు తేలటంతో ఎంక్వయిరీ స్పీడప్‌ చేశారు పోలీసులు.

Share this post

submit to reddit
scroll to top