మనుషులకే పుట్టాడా వాడు?

youtuber-hanmanthu.jpg

థూ నీ బతుకు. మనిషివేనా నువ్వు. కడుపుకి అన్నమే తింటున్నావా అశుద్ధమేనన్నా మెక్కుతున్నావా? సోషల్‌మీడియాలో అతని వికారపు ప్రవర్తన చూశాక సభ్యసమాజం కాండ్రించి ఉమ్ముతోంది. వీడియోలు జనం చూస్తే చాలనుకున్న యూట్యూబర్‌ సెగ తగిలేసరికి కాళ్ల బేరానికొచ్చాడు. క్షమాపణలు చెబుతున్నాడు. పంచ మహాపాతకాలను మించిన పాపం చేసిన ప్రణీత్‌ని అంత సులువుగా ఎవరైనా క్షమించగలరా? తండ్రి కూతురు మధ్య అనైతిక సంబంధాన్ని అంటగట్టే నీచమైన ప్రవృత్తి సారీ ఒక్క మాటతో సమసిపోతుందా?

ఫ్యామ్‌ బ్యాచ్. ఈ పేరుతోనే ఇన్‌స్టాలో రీల్స్‌ చేస్తుంటాడు సమాజంలో చెడబుట్టిన ప్రణీత్‌. యూట్యూబ్‌లో పిచ్చిపిచ్చి కంటెంట్‌ పెడుతుంటాడు. అందులో అన్నీ బూతులే. ఆ బూతులు అల్లేది కూడా తండ్రి-కూతురు మధ్య. చేసిన వీడియోలన్నీ తండ్రీకూతుళ్ల సంబంధాలను అశ్లీలంగా వక్రీకరిస్తూ చేసిన చెత్తే. యూట్యూబ్‌ వ్యూస్‌ కోసం, రీల్స్‌కు లైక్స్‌ కోసం ఇంత నీచాతినీచంగా ప్రవర్తించినవారిని మనం ఇప్పటిదాకా చూసుండం. ఈ విలువల్లేని వెధవకు ఇన్‌స్టాలో 57వేల మందికి పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. ఆడవారిపై, బాలికలపై అత్యాచారం తప్పేం కాదనేలా ఉంటాయి వీడి కామెంట్స్‌. తండ్రీకూతురు సరదాగా ఆడుకుంటున్న వీడియో చూసినా సరే.. అందులో బూతు వెతుకుతూ వెకిలి మాటలు మాట్లాడతాడు ప్రణీత్‌. అందుకే సోషల్‌మీడియాలో న్యూసెన్స్‌ని ఇన్నాళ్లూ భరిస్తూ వచ్చిన జనం ప్రణీత్‌ అనేవాడిని ఉప్పుపాతరేసినా తక్కువే అంటున్నారు.

ప్రణీత్‌ అనేవాడి వీడియోలు అంత అభ్యంతకరంగా ఉండబట్టే హీరోలు సాయి ధరమ్‌ తేజ్, సుధీర్, మంచు మనోజ్, నారా రోహిత్‌లాంటివారంతా చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, పోలీస్ ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ చేశారు. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెండురాష్ట్రాల డీజీపీలు స్పందించారు. ప్రణీత్‌పై కేసులు పెట్టి పట్టుకొచ్చి లోపలేశారు. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో యూట్యూబర్ ప్రణీత్‌ తప్పయిపోయిందని లెంపలేసుకుంటున్నాడు. ఓ తండ్రి తన కూతురితో ఉన్న వీడియోపై డార్క్ కామెడీ పేరుతో యుట్యూబర్ ప్రణీత్ వల్గర్ కామెంట్స్ చేశాడు. సమాజమంతా మొహంమీద ఊసేసరికి కర్చీఫ్‌తో తుడుచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. క్షమిద్దామా ఇతన్ని. పొరపాటునైనా క్షమించగలమా ఇతన్ని?

 

Share this post

submit to reddit
scroll to top