ఆకాశంలో హోలి కనువిందు చేసింది. భూమ్మీద మనం కలర్స్ చల్లుకుంటే…ఆకాశంలో హోలీ జరుపుకున్నాడు అందాల చందమామ. రంగులపండుగనాడే చోటుచేసుకుంది ఈ అద్భుత ఘట్టం. అదే బ్లడ్ మూన్. ఈ ఏడాది హోలీ రోజున సంభవించింది మొదటి గ్రహణం. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం.
భూమి, సూర్యుడు, చంద్రుడు ఒక సరళరేఖ పై ఉన్న సమయంలో చంద్రుడిని భూమి నీడ పూర్తిగా కప్పేస్తుంది. దీనిని చంద్ర గ్రహణం అంటారు. మన దేశంలో మార్చి 14న ఉదయం 9.27 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగిందీ బ్లడ్‌మూన్. బ్యాడ్‌లక్ ఏంటంటే మనకంటికి మాత్రం కనిపించలేదు.
చంద్రగ్రహణం పగటిపూట సంభవిస్తుంది కాబట్టి ఇది మన దేశంలో కన్పించలేద. కేవలం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల్లోనే కనువిందు చేసింది. ఇది కేవలం ఒక ఖగోళ వింత మాత్రమేనని, అంతకంటే దీనికి ప్రాముఖ్యత లేదని తేల్చేశారు సైంటిస్టులు.
జ్యోతిష్యుల వాదన మరోలా ఉంది. ఇది కేతు గ్రస్త ఉత్తరా నక్షత్రం కన్యా రాశిలో ఏర్పడిన చంద్రగ్రహణం కావటంతో కొన్ని రాశుల మీద దీని ప్రభావం కచ్చితంగా ఉంటుందని వాళ్లు చెబుతున్నారు.