పూసలమ్మే అమ్మాయి పెళ్లిచేసుకుంది. పూరిగుడిసె అమ్మాయే అయితే ఎవరూ పట్టించుకోరు. కానీ ఇప్పుడు తనో సెలబ్రిటీ. మహాకుంభమేళాలో నీలికళ్లతో ప్రపంచానికి పరిచయమైన సరికొత్త సెలబ్రిటీ తను. సోషల్‌మీడియాని షేక్‌చేసి చివరికి సిల్వర్స్క్రీన్దాకా వచ్చేసింది. ఓ వంద బాలీవుడ్ సిన్మాలు చేసినంత పేరొచ్చేసింది మధ్యప్రదేశ్‌కి చెందిన నిరుపేద సెలబ్రిటీ మోనాలిసాకి. అప్పుడే ప్రేమలో పడింది. పెళ్లికూడా చేసేసుకుంది. కానీ ఇప్పుడా పెళ్లే ఓ పెద్ద వివాదమయ్యేలా ఉంది.
ప్రేమయినా, పెళ్లయినా వ్యక్తిగతం. దానికి అడ్డుగోడలేమీ ఉండవు. కానీ మత విద్వేషం రంకెలేస్తున్న సమయంలో ఆ ఇద్దరి పెళ్లీ కొత్త చిచ్చురేపేలా ఉంది. ఎందుకంటే మోనాలిసా పెళ్లాడింది పరమత ప్రేమికుడిని. మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా, యూపీకి చెందిన నటుడు ఫర్మాన్ ఖాన్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే కూతురి ప్రేమ పెళ్లికి మోనాలిసా తండ్రి జైసింగ్ భోంస్లే ఒప్పుకోలేదు. దీంతో ఈ జంట కేరళకు పారిపోయి, తిరువనంతపురంలోని ఒక ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది.

దర్శకుడు సనోజ్మిశ్రాతో మోనాలిసా
తండ్రి నుండి ప్రాణహాని ఉందంటూ మోనాలిసా కేరళ పోలీసులను ఆశ్రయించి రక్షణ కోరింది. తాను మేజర్‌ననీ, మనసుపడ్డవాడిని తన ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నానంటోంది మోనాలిసా. ఈ పెళ్లిపై డైరెక్టర్ సనోజ్ మిశ్రా రియాక్షన్ వివాదానికి ఆజ్యంపోస్తోంది. మోనాలిసాను హీరోయిన్గా పరిచయం చేస్తానని గతంలో ప్రకటించిన సనోజ్మిశ్రా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ పెళ్లిని ‘లవ్ జిహాద్’ అని ఆరోపించారు. మోనాలిసాను గంగా మాత అవతారంగా భావించానని, కానీ తన పెళ్లి విషయం తెలిసి తన మనసు ముక్కలైందంటున్నారు.
మోనాలిసా పెళ్లి వివాదంలో సోషల్ మీడియాలో రెండుగా చీలిపోయారు. కొందరు డైరెక్టర్ వ్యాఖ్యలకు మద్దతిస్తుంటే.. ఒకరి వ్యక్తిగత జీవితంపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని మరికొందరు విమర్శిస్తున్నారు. కొందరేమో మోనాలిసా జీవితాన్ని నాశనం చేసుకుందని అంటున్నారు. గుడిలో దండలు మార్చుకుని, ఫర్మాన్‌తో తాళి కట్టించుకుని మోనాలిసా దేవుడికి దండం పెట్టుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కుంభ మేళా సుందరి పెళ్లి ఇప్పుడు నేషనల్ వైడ్ టాపిక్ అయ్యింది.
Kumbh Mela fame Monalisa Bhosle married Farman Khan at a temple in Thiruvananthapuram.
Couple sought Kerala Police protection due to her family opposition.
Speechless! pic.twitter.com/9fMhDV2p3p
— Shilpa (@shilpa_cn) March 11, 2026





