మన అరకు కాఫీ అదుర్స్‌..

araku-tribals.jpg

కుదిరితే కప్పు కాఫీ. అది కూడా సౌతిండియన్‌ ఫ్లేవర్‌ అయివుండాలి. దక్షిణాది ఫిల్టర్‌ కాఫీకి ప్రపంచం దాసోహం అంటోంది. అందులో మన అరకు కాఫీ ఫ్లేవర్‌ అందరికీ తెగ నచ్చేస్తోంది. సహజ అందాల అరకులో కాఫీ తోటలు అడవి బిడ్డలకు ఆదాయ వనరుగా మారాయి. ముఖ్యంగా మేడిన్‌ అరకు కాఫీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాఫీ ప్రియులకు హాట్‌ఫేవరేట్‌గా మారింది.

ఏపీ సర్కార్‌ చొరవతో ఇప్పుడు పార్లమెంట్‌లోనూ అరకు ఫిల్టర్‌ కాఫీ ఘుమఘమలాడుతోంది. మరోవైపు సౌతిండియన్‌ ఫిల్టర్‌ కాఫీ రుచికి ప్రపంచమే ఫిదా అవుతోంది. కాఫీ ప్రియుల హాట్‌ ఫేవరేట్‌గా సెకండ్‌ ప్లేస్‌ దక్షిణాది ఫిల్టర్‌ కాఫీదే. ఉదయించే సూర్యుడిని చూస్తే ఎంతో ఆనందం. ఎర్లీ మార్నింగ్‌ మంచి ఫిల్టర్‌ కాఫీ తాగితే రోజంతా ఒళ్లంతా తుళ్లింతే. టేస్ట్‌కి టేస్ట్‌..హెల్తీకి హెల్తీ. అదీ మన అరకు ఫిల్టర్‌ కాఫీ స్పెషాలిటీ.

ఎన్నో రకాల పసందైన కాఫీలున్నా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సౌతిండియన్‌ ఫిల్టర్‌ కాఫీదే పైచేయి. ప్రపంచమంతా మన అరకు సహా దక్షిణాది కాఫీకి ఫిదా అంటోంది. టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన ది బెస్ట్‌ కాఫీ ఫ్లేవర్ల జాబితాలో వరల్డ్‌వైడ్‌ టాప్‌ 38 లిస్ట్‌లో సౌతిండియన్‌ ఫిల్టర్‌ కాఫీ రెండో స్థానంలో నిలిచింది. రంగు, రుచి, చిక్కదనం అన్ని కాఫీ బ్రాండ్లలో ఉండొచ్చు. కానీ రుచిలో మాత్రం సౌతిండియన్‌ ఫిల్టర్‌ కాఫీ వెరీ వెరీ స్పెషల్‌.

టేస్ట్‌ అట్లాస్‌ జాబితాలో క్యూబా డార్క్‌ రోస్టెడ్‌ కాఫీ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిస్తే . ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రియులు సౌతిండియన్‌ ట్రేడిషనల్‌ ఫిల్టర్‌ కాఫీకి రెండో ర్యాంక్‌తో పట్టం కట్టారు. అలా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సౌతిండియన్‌ ఫిల్టర్‌ కాఫీకి క్రేజ్‌ పెరుగుతోంది. సౌతిండియా ట్రెడిషనల్‌ ఫిల్టర్‌ కాఫీనా మజాకా!

Share this post

submit to reddit
scroll to top