తమిళనాడు రాజకీయ చరిత్రను తిరగరాస్తాడో లేదోగానీ తమిళ హీరో విజయ్ కాపురం మాత్రం కోర్టుకెక్కింది. విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల కేసు జూన్ 15కి వాయిదా పడింది. భర్త వివాహేతర సంబంధం, శారీరక క్రూరత్వం కారణాలతో విజయ్‌తో విడిపోయేందుకు సంగీత డైవోర్స్ పిటిషన్ దాఖలు చేశారు. త్రిషతో ఎప్పట్నించో రిలేషన్‌లో విజయ్ కట్టుకున్న పెళ్లానికి విడాకులిచ్చేందుకు సిద్ధపడ్డాడు.
విజయ్‌భార్య సంగీత 2025 డిసెంబరులోనే విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో ఆమె విజయ్ ఒక నటితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపించారు.తనను నిరంతర మానసిక వేధింపులకు గురిచేయడంతో పాటు నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపించారు. వివాహ రద్దుతో పాటు తన దాంపత్య గృహంలో నివాస హక్కు, విజయ్ నుంచి శాశ్వత భరణం కోరారు.
విజయ్, సంగీత 1996లో మొదటిసారి కలుసుకున్నారు. శ్రీలంకకు చెందిన సంగీత బ్రిటన్‌లో పెరిగారు. ఈ జంట 1998లో యుకేలో తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. అనంతరం 1999 ఆగస్టు 25న చెన్నైలో హిందూ సంప్రదాయ ప్రకారం వివాహం చేసుకున్నారు. 2000 ఆగస్టు 26న మొదటి సంతానంగా కుమారుడు జేసన్ సంజయ్, 2005లో కూతురు దివ్య సాషా పుట్టారు. విజయ్ టీవీకే పార్టీ స్థాపించి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతున్న సమయంలోనే త్రిషతో ఆయన బంధం వివాదాస్పదంగా మారి భార్య విడాకుల పిటిషన్ వేసేదాకా వెళ్లింది.
భర్త విజయ్‌నుంచి 250 కోట్ల భరణం కోరుకుంటోంది సంగీత. కానీ 35కోట్లు ఇచ్చేందుకే విజయ్ సిద్దమంటున్నాడు. పిల్లలిద్దరి బాధ్యత తాను చూసుకుంటానంటున్నాడు. ఇన్నేళ్ల దాంపత్య జీవితంలో భార్య పేరు మీద ఒక్క ఆస్తి కూడా పెట్టలేదు విజయ్. తమిళనాడుతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.





