వరల్డ్‌కప్ సెమీస్‌లో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా ఘనవిజయం తర్వాత ఓ పత్రిక పెట్టిన టైటిల్ ఇది. నిజమే షమీ నిప్పుల్లాంటి బంతులు సంధించకుంటే? కీలకమైన వికెట్లను పడగొట్టలేకపోయుంటే? న్యూజిలాండ్ మరింత చెలరేగిపోయేదేమో! న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత పేసర్ షమీ ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. వరల్డ్ కప్ చరిత్రలో భారత్ తరపున ఓ బౌలర్ ఏడు వికెట్లు పడగొట్టడం ఇదే మొదటిసారి. 2003లో ఆశిష్ నెహ్రా ఆరు వికెట్లు తీసి వరల్డ్‌కప్‌లోని సింగిల్ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర నెలకొల్పాడు. 20 ఏళ్ల తర్వాత షమీ ఆ చరిత్రను తిరగరాశాడు.
భారీ టార్గెట్‌ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కి దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లు దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆరో ఓవర్ వేసేందుకు రంగంలోకి దిగిన షమీ రం తొలి బంతికే కాన్వే వికెట్‌ని పడగొట్టాడు. ఎనిమిదో ఓవర్‌లో రచిన్ రవీంద్ర వికెట్ తీసి కివీస్‌పై ఒత్తిడి పెంచాడు. అయితే కేన్ విలియమ్సన్, డేరిల్ మిచెల్ క్రీజ్‌లో పాతుకుపోయారు. షమీ క్యాచ్ మిస్ అయ్యాక విలియమ్సన్ మరింత రెచ్చిపోయాడు. అయితే 33వ ఓవర్‌లో విలియమ్సన్ వికెట్ తీసి లెక్క సరిచేశాడు షమీ.
అదే ఓవర్‌లో టామ్ లాథమ్‌ని కూడా షమీ డకౌట్ చేయటంతో మ్యాచ్ టీమిండియా వైపు టర్న్ అయ్యింది.
సెంచరీ కొట్టాక మిచెల్ క్రీజ్‌లో సెటిలైపోవటంతో తన ఐదో వికెట్‌గా మిచెల్‌ని పెవిలియన్‌కి సాగనంపాడు షమీ. ఈ వరల్డ్‌కప్‌లో మూడో ఫైఫర్ (ఐదు వికెట్ల హాల్) నమోదు చేశాడు. అయినా వికెట్ల దాహంతీరని షమీ 49వ ఓవర్‌లో మరో రెండు వికెట్లు పడగొట్టాడు. ఏడు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో కివీస్ జట్టుపై షమీ నిప్పుల్లాంటి బంతులతో విరుచుకుపడటం ఇది రెండోసారి. లీగ్ దశలో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో మ్యాచ్‌లో కూడా ఐదు వికెట్లు పడగొట్టి కివీస్ ఓటమికి దారిచూపించాడు.
https://www.instagram.com/mdshami.11/?utm_source=ig_embed&ig_rid=2cf2ab17-81a6-48c7-8b22-f565436ae0c6