రుషికొండపై అదో గుదిబండ!

Rushikonda20Palace-380x214-1-e1766122720551.jpg

రుషికొండ భవనాలను ఏం చేయాలి?
వాటిని ఎలా ఉపయోగించుకోవాలి?
ఏడాదిన్నరకాలంగా కూటమి ప్రభుత్వ పెద్దల్ని వేధిస్తున్న ప్రశ్నలివి. మేధావులను అడిగారు. ప్రజాభిప్రాయానికి వెళ్లారు. మంత్రుల కమిటీ వేశారు. అయినా ఓ నిర్ణయానికి రాలేకపోయారు. ఇంకా ఎన్నాళ్లు నానుస్తారని విమర్శలు రావడంతో రుషికొండ ప్యాలెస్‌ ఇష్యూను సీరియస్‌గా టేకప్ చేసింది కూటమి సర్కార్.

విశాఖపట్నం రుషికొండపై హరిత రిసార్ట్స్ కూల్చేసి సుమారు రూ.452 కోట్ల ఖర్చుతో వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన అధునాతన భవనాలు.. కూటమి సర్కార్‌కు గుదిబండలా మారాయి. ఒక నిర్దిష్టమైన లక్ష్యమంటూ లేకుండా నిర్మించిన రుషికొండ భవనాల్ని ఏ ప్రయోజనం కోసం వాడుకోవాలన్న తర్జనభర్జన జరుగుతూనే ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ విజిట్ చేసి మాయా మహల్‌లా ఉందంటూ కామెంట్లు చేశారు. కానీ వాటినేం చేయాలో ఓ క్లారిటీకైతే రాలేకపోయారు.

దేశవ్యాప్తంగా అనేక బ్రాండెడ్ రిసార్టులకు చెందిన 45 మంది ప్రతినిధులతో మంత్రుల కమిటీ భేటీ అయింది. కానీ ఓ నిర్ణయానికి రాలేకపోయింది. పర్యాటక ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని, ఆరోగ్య కేంద్రంగా మార్చాలని, వెల్‌నెస్ సెంటర్, మ్యూజియం లాంటివి ఏర్పాటు చేయాలని గతంలో అనేక సలహాలు సూచనలు వచ్చాయి. ప్రాధమికంగా దేనివైపూ ప్రభుత్వం మొగ్గు చూపలేదు ప్రభుత్వం. పీపీపీ పద్ధతిలో డెవలప్ చేయడమా, ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలా అనేది ఒక డైలమా.

ఒకవేళ పీపీపీకి వెళ్తే ప్రాజెక్టును ఒక్కరికే అప్పగించాలా, మల్టిపుల్ కంపెనీల చేతుల్లో పెట్టాలా అనేది మరో కన్‌ఫ్యూజన్. ముగ్గురు మంత్రులూ అన్ని కోణాల్లో చర్చించినా క్లారిటీ రాలేదు. లీలా ప్యాలెస్ పేరుతో స్టార్‌ హోటల్‌గా అభివృద్ధి చేసేలా, టాటా గ్రూప్ నుంచి ఓ కాన్సెప్ట్ ప్లాన్ వచ్చింది. ఈ ప్రపోజల్‌కే చివరికి మంత్రుల కమిటీ ఓటేసేలా ఉంది.

Share this post

submit to reddit
scroll to top