మన ఓటర్లు చాలా స్మార్ట్‌ గురూ!

modi-rahul.jpg

భారతీయ ఓటర్ల నాడి పట్టుకోవడం అంత సులభమైన విషయం కాదని మరోసారి రుజువైంది. అసలు ఫలితాలకు ఎంత ప్రాధాన్యముందో ఎగ్జిట్‌ పోల్స్‌కు కూడా అంతే ఆదరణ ఉంది. అవి కరెక్టవుతాయా, తప్పవుతాయా అనేది పక్కన పెడితే వాటి క్రేజ్‌వాటిదే. చాలా సందర్భాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌- ఎగ్జాక్ట్‌ రిజల్ట్స్‌ మధ్య నక్కకు నాకలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉంది. ఈ ఎన్నికల్లోనూ అది మరోసారి రుజువైంది.

ఈ ఎన్నికల్లో NDA ఘనవిజయం సాధిస్తుందని, ప్రధాని మోదీ చెప్తున్నట్టు ఎన్డీయే కూటమి చార్‌ సౌ పార్‌ అవుతుందని చాలా ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. 2019లో 353 స్థానాల్లో గెలిస్తే ఈ ఎన్నికల్లో 379 స్థానాల్లో గెలిచి ఘనవిజయాన్ని అందుకుంటుందని ప్రకటించాయి. బట్ వాస్తవ ఫలితాలు దానికి భిన్నంగా ఉన్నాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి విషయంలోనూ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు బోల్తా పడ్డాయి. పెద్దగా పోటీ ఇవ్వలేదనుకున్న ఇండియా కూటమి బీజేపీకి చుక్కలు చూపించింది.

ఇండియా టుడే యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్‌ తన సర్వే గురించి గొప్పగా చెప్పుకుంది. 542 నియోజకవర్గాల్లో దాదాపు 6 లక్షల మందిని ఇంటర్వ్యూ చేసినట్టు ప్రకటించింది. మై యాక్సిస్‌ సొంతంగా 322 నుంచి 340 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌ పార్టీకి 60 నుంచి 76 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఇండిపెండెంట్లు 8 నుంచి 20 సీట్ల వరకు గెలుస్తాయని ఆ ఎగ్జిట్‌ పోల్ పేర్కొంది. అయితే నిజమైన ఫలితాల్లో ఈ అంచనాలన్నీ తప్పుగా రుజువయ్యాయి.

హిందీ రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేస్తుందని చాలా ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించాయి. కాని ఉత్తరప్రదేశ్‌లోనే బీజేపీ ఘోరంగా దెబ్బతింది. వాస్తవానికి 2004 ఎన్నికల్లో ఇండియా షైనింగ్‌ పేరుతో బీజేపీ చేపట్టిన ప్రచారం భారీ ఫలితాన్ని ఇస్తుందని. అంచనా వేశాయి. నాటి వాజ్‌పేయి సర్కారు 240 నుంచి 275 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించాయి. కాని, నాడు NDAకి వచ్చింది 187 సీట్లు మాత్రమే. కాంగ్రెస్‌, మిత్రపక్షాలు 216 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

2014 ఎన్నికల్లోనూ ఎగ్జిట్‌ పోల్స్‌-ఎగ్జాక్ట్ పోల్స్ మిస్‌ మ్యాచ్‌ అయ్యాయి. బీజేపీ నాయకత్వంలోని NDA విజయం సాధిస్తుందని కాని మెజార్టీ మార్కుకు చేరుకోలేదని చాలా ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. 261 నుంచి 289 సీట్లు రావచ్చని లెక్కగడితే ఆ ఎన్నికల్లో NDA 336 స్థానాల్లో విజయం సాధించింది. ఏదేమైనా ఈ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుందనే చెప్పాలి. NDA కూటమి గెలిచి ఓడిందన్నట్లుంటే, ఇండియా కూటమి ఓడినా గెలిచినంత సంబరంగా ఉంది.

Share this post

submit to reddit
scroll to top