కొండ‌కి వెంట్రుక‌.. వ‌స్తే కొండ.. ఊడితే!?

kharge-sonia-rahul.jpg

టార్గెట్‌ తెలంగాణ.. కాంగ్రెస్ వ్యూహం.. విజయభేరి సభలో ఆరు కీలక హామీలు

కొండమీది కోతిని తెచ్చిస్తాం. చంద‌మామ‌ని నేల‌మీదికి తీసుకొస్తాం. ఎడారిలో న‌దులు పారిస్తాం.. ఎన్ని హామీలైనా ఇవ్వొచ్చు. త‌ర్వాత అడిగేదెవ‌రు. కొన్ని కుద‌రొచ్చు.. కుద‌ర‌క‌పోవ‌చ్చు. కానీ ఏ హామీ ఇవ్వ‌క‌పోతే ఓట్లెలా ప‌డ‌తాయ్‌. క‌ర్నాట‌కలో విజ‌యం త‌ర్వాత కాంగ్రెస్ ఉచిత హామీల‌తో ఊద‌ర‌గొడుతోంది. హైద‌రాబాద్‌లో సీడ‌బ్ల్యుసీ స‌మావేశాల త‌ర్వాత నిర్వ‌హించిన విజ‌య‌భేరి స‌భ‌లోనూ కాంగ్రెస్ అసాధ్య‌మైన హామీలిచ్చింది. అధికారంలోకి తెస్తే అన్నీ చేసి చూపిస్తానంటోంది,

రైతుబంధు, ద‌ళిత‌బంధులాంటి ప‌థ‌కాల‌తో తెలంగాణ‌లో బ‌లంగా ఉన్న బీఆర్ఎస్ విజ‌యానికి బ్రేక్ వేయాలంటే అంత‌కుమించిన బ్ర‌హ్మాస్త్రాలు కావాలి. తుక్కుగూడ స‌భ‌లో అమ్ముల‌పొదిలోంచి అలాంటి అస్త్రాల‌నే కాంగ్రెస్ పార్టీ బ‌య‌టికి తీసింది. ద‌శాబ్ధాల ప్ర‌త్యేక రాష్ట్ర క‌ల‌ని సాకారం చేసినా అధికారం ఇవ్వ‌ని తెలంగాణ‌ప్ర‌జ‌ల‌పై హామీల వ‌ర్షం కురిపించింది. తెలంగాణ‌లో అధికారంలోకొస్తే ఆరు గ్యారంటీల‌ను అమలు చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.

1) మహాలక్ష్మి పథకం..
మహిళలకు ప్రతీ నెలా రూ.2,500
పేద మహిళలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

2) రైతు భరోసా..
ఏటా రైతులతో సహా కౌలు రైతుకు రూ.15 వేలు
వ్యవసాయ కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు
వరికి మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్‌

3) ఇందిరమ్మ ఇళ్ల పథకం
ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం

4) గృహజ్యోతి పథకం
పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

5) చేయూత పథకం
రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా
చేయూత కింద నెలకు రూ.4 వేల పింఛన్‌

6) యువ వికాసం
విద్యార్థుల కోచింగ్‌ ఫీజు కోసం రూ.5 లక్షలదాకా సాయం

Share this post

submit to reddit
scroll to top