ఇప్పుడిక లోకేష్‌ వంతు!

naralokesh-cid-notice.jpg

చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత ఆయన కుమారుడు నారా లోకేష్‌ ఢిల్లీలోనే మకాం వేశారు. ఫలితం ఉండదని తెలిసినా అక్కడ నిరసనలతో నేషనల్‌ మీడియా దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్క స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో టీడీపీ అధినేత జైల్లో ఉండగానే.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఢిల్లీకి వెళ్లి నారా లోకేష్‌కి నోటీసులు అందించింది. విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

ఏపీ రాజకీయాల్లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసు ప్రకంపనలు రేపుతోంది. నారా లోకేష్‌ ప్రమేయంపై ఆధారాలు ఉన్నాయంటున్న సీఐడీ ఆయన్ని విచారించేందుకు సిద్ధమైంది. ఈ కేసులో A14గా ఉన్న లోకేష్‌కు ఢిల్లీకి వెళ్లి 41ఏ నోటీసులు ఇచ్చింది సీఐడీ. చంద్రబాబు అరెస్టు తర్వాత ఢిల్లీకి వెళ్లిన లోకేష్ ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో ఉంటున్నారు. అధికారులు అక్కడికే వెళ్లి అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులిచ్చారు.

ఐపీసీ సెక్షన్లు 120(B), 409, 420, 34, 35, 36, 37, 166, 167, 217తో పాటు అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్ 13(2), 13(1)(c) (d) కింద విచారణ చేపట్టినట్లు సీఐడీ ఆ నోటీసుల్లో పేర్కొంది. కేసుకు సంబంధించి హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతా వివరాలు, భూ లావాదేవీలకు సంబంధించిన బోర్డు సమావేశాల మినిట్స్‌తో కూడిన పుస్తకాన్ని, ఆ లావాదేవీలకు అవసరమైన చెల్లింపు వివరాలను తమకు దర్యాప్తులో భాగంగా అందజేయాలని 10అంశాలతో సీఐడీ నోటీసులు ఇచ్చింది సీఐడీ. విచారణకు హాజరవుతానని చెప్పిన నారా లోకేష్‌ ఆ నోటీసులోని కొన్ని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు జైల్లో ఉండగానే లోకేష్‌కి నోటీసులు అందటంతో అక్టోబర్ 4న విచారణ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయనే ఉత్కంఠ నెలకొంది.

Share this post

submit to reddit
scroll to top