లైంగిక దాడి కాదు తనే హనీట్రాప్ చేసిందంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నంచేసింది నీతిమాలిన మీడియా. ఆ అమ్మాయి మైనర్ కాదు మేజరంటూ కేసును పక్కదోవ పట్టించే ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. కోవాబన్ కల్తీ అంటూ ఓ చిరువ్యాపారి విషయంలో గొంతు చించుకున్నవారెవరికీ కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు చేసింది తప్పని చెప్పేందుకు గొంతు పెగలడం లేదు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కొడుకుపై పోక్సో కేసు నేషనల్మీడియాలో హైలైట్ అయిందిగానీ పక్కలు పరిచేందుకు అలవాటుపడ్డ తెలుగు మీడియాకు చీమ కుట్టినట్లు కూడా లేదు. పైగా బాధిత బాలికనే కట్టుబాట్లు తెలీని బజారు అమ్మాయిలా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది.
కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ నిర్వాకాలు ఒక్కోటీ వెలుగు చూస్తున్నాయి. ఆ బాలిక విషయంలోనూ అంతనెంత దారుణంగా ప్రవర్తించాడో బయటికొస్తోంది. సంపన్న కుటుంబానికి చెందిన బాలిక రెండు కోట్లకోసం హనీట్రాప్ చేసిందంటూ బండి గ్యాంగ్ చేసిన వాదన తేలిపోయింది. తమ కుటుంబాన్ని దోషిలా చూపిస్తుండటంతో ఆవేదనకు గురైన బాధిత బాలిక తల్లి విడుదల చేసిన ప్రకటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఆమె వెల్లడించిన అంశాలు విస్మయానికి గురిచేస్తున్నాయి.
కేంద్ర మంత్రి కుమారుడి చేతిలో మోసపోయామని, ప్రాణ భయంతో బతుకుతున్నామని బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తమది సాధారణ మధ్యతరగతి కుటుంబమని, రాజకీయ అండదండలు ఉన్న వ్యక్తులతో పోరాడలేక వ్యవస్థల ముందు మోకరిల్లుతున్నామని బాధిత బాలిక తల్లి ఆవేదన వ్యక్తంచేశారు. ఆ తల్లి ప్రకటన ప్రకారం.. 2025లో బండి భగీరథ్‌తో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. మొదట్లో సాధారణంగా సాగిన ఈ పరిచయం, ఆ తర్వాత ప్రలోభాలు, ఒత్తిడితో కూడిన సంబంధంగా మారింది. తన కూతురిని మాయమాటలతో లొంగదీసుకుని, భగీరథ్ తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడని ఆమె ఆరోపించారు.
యూపీలో ఒక అమ్మాయి మీద లైంగికదాడి జరిగితే.. నిందితుడి తల్లిదండ్రులు ఒక్కటే చెప్పారు. ‘తప్పు చేసింది ఎవరైనా తప్పు తప్పే! మా కొడుకును కావాలంటే ఎన్కౌంటర్ చేసుకోండి’ అని తెగేసిచెప్పారు. ఆడబిడ్డ వేదన తెలిసిన సామాన్యుడి స్పందన ఎంత హుందాగా ఉంది? మరి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హోదాలో మహిళలందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత గల బండి సంజయ్ ఏం చేయాలి? కొడుకును వెనకేసుకొస్తూ బాధిత బాలికపైనే తప్పుడు కేసు పెట్టేందుకు ఎందుకు సహకరించారు? ఇదేనా ‘బేటీ బచావో’? ఇదేనా ‘నారీశక్తి సమ్మాన్’?
2025 డిసెంబర్ 31 రాత్రి, 2026 జనవరి 1 తెల్లవారుజామున మొయినాబాద్ ప్రాంతంలో తన కూతురిపై కేంద్రమంత్రి కొడుకు బండి భగీరథ్ శారీరక దాడికి పాల్పడ్డాడని బాలిక తల్లి తీవ్ర ఆరోపణలు చేశారు. మద్యం సేవించాలని ఒత్తిడి చేసి, అచేతన స్థితిలో ఉన్న బాలికపై అఘాయిత్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా పదేపదే శారీరక సంబంధం కోసం ఒత్తిడి తెచ్చాడని ఆమె వెల్లడించింది. న్యాయం కోసం తాము పడ్డ కష్టాలను వివరిస్తూ.. 2026 ఏప్రిల్ 23న కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసానికి వెళ్ళినట్లు ఆమె తెలిపారు. భగీరథ్ ప్రతినిధిగా చెప్పుకునే సంగప్ప (మాజీ జర్నలిస్టు) అనే వ్యక్తి సూచన మేరకు అక్కడికి వెళ్తే, తమకు భరోసా లభిస్తుందని ఆశించామని, కానీ దానికి భిన్నంగా అక్కడ తమకు బెదిరింపులే ఎదురయ్యాయని బాధితురాలి తల్లి ఆరోపించింది.
కేంద్రమంత్రి బండి సంజయ్‌తో భేటీ తర్వాత తీవ్రమైన ప్రాణ భయంతో బయటికి వచ్చామని, తమ కుటుంబానికి హాని తప్పదని హెచ్చరించారని ఆమె పేర్కొన్నారు. మే 8న పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించినప్పుడు కూడా తమకు చేదు అనుభవమే ఎదురైందని బాధితురాలి తల్లి తెలిపింది. మైనర్ అని చెప్పినప్పటికీ గంటల తరబడి స్టేషన్లో నిరీక్షించేలా చేశారని ఆరోపించారు. చివరకు ‘జీరో ఎఫ్ఐఆర్’ కోసం పట్టుబట్టిన తర్వాతే పోలీసులు స్పందించారని ఆమె వెల్లడించారు. మొదట బెయిల్ వచ్చే సెక్షన్లే పెట్టినప్పటికీ, ప్రజాగ్రహం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు తర్వాతే కఠిన సెక్షన్లు నమోదు చేశారని బాధితురాలి తల్లి తెలిపారు.
సోషల్ మీడియాలో తన కూతురి వయసుపై, గుర్తింపుపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తల్లి వాపోయారు. న్యాయ విచారణను తప్పుదోవ పట్టించడానికే ట్టిన తేదీపై వివాదాలు సృష్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే బిడ్డకు జరగకూడదని కన్నీటిపర్యంతం అవుతోందా తల్లి.





