హలో అన్నారో.. కిరికిరి మొదలైనట్లే!

datin-apps-e1767934763256.jpg

డేటింగ్ యాప్‌లు.. ఇవాళా రేపూ వీటి ప్రభావం ఎక్కువైపోయింది. ఎంతవారలైనా కాంతదాసులే. ఈ వీక్‌నెస్‌నే ఎడ్వాంటేజ్‌గా తీసుకుని సైబర్‌ చీటర్లు రెచ్చిపోతున్నారు. డేటింగ్‌యాప్‌ల బారిన పడి 2025లో తెలంగాణలో ఏకంగా 589 మంది మోసపోయారు. దాదాపు 80 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదై ఎంక్వయిరీ నడుస్తోంది. డేటింగ్ ముసుగుతో మోసపోయి వీళ్లు సమర్పించుకున్న సొత్తెంతో తెలుసా? అక్షరాలా 3 కోట్ల రూపాయలు. ఏటా ఇది పెరుగుతూనే ఉంది.

కుర్రాళ్లే కాదు, బాగా చదువుకున్నోళ్లు, సొసైటీలో మంచి స్టేటస్ ఉన్నవాళ్లు, బిగ్‌షాట్లు కూడా బలహీన క్షణంలో హనీట్రాప్‌లో చిక్కుకుంటున్నారు. వారి వీక్‌నెస్‌ని కొందరు క్యాష్‌ చేసుకుంటున్నారు. ట్రాప్‌లోకి లాగి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. నిజానికి డేటింగ్ యాప్ అనేది జస్ట్ ఒక యాక్సెస్ మాత్రమే. ఫోనెత్తగానే తియ్యటి మాటలతో ముగ్గులోకి దించుతారు. ఒక్కోసారి పెళ్లిదాకా తీసుకెళతారు, తర్వాత మన బ్యాంకు బ్యాలెన్సులపై ఫోకస్ పెడతారు.

ఫలానా చోట ఇన్వెస్ట్‌ చెయ్యమని సలహాలిస్తారు. కొందరైతే మ్యాట్రిమొనీ సైట్స్ నుంచి నెంబర్లు తీసుకుని పెళ్లిపంచాయతీలు పెడతారు. పొరపాటున ఆ ట్రాప్‌లో పడిపోయామో.. బతుకు బస్టాండే. తియ్యగా మాట్లాడి రిలేషన్‌షిప్‌లోకి దింపి తర్వాత వసూళ్లకు పాల్పడతారు. మనకు తెలీకుండానే మనల్ని నిండా ముంచేస్తారు. ఒకవేళ డేటింగ్ యాప్‌లో బుక్కయితే, దాన్నుంచి బైటపడలేమా అంటే దానికీ చిట్కాలు ఉన్నాయ్. డబ్బు ప్రస్తావనొస్తే వెంటనే ఆ రిలేషన్‌ని అక్కడికక్కడే కట్ చెయ్యడమే. మోసపోతున్నామని డౌటొస్తే మొహమాటాలకు పోకుండా ఉన్నదున్నట్లు పోలీసులకు చెప్పేయడమే!

Share this post

submit to reddit
scroll to top