ఎన్నారై సాఫ్ట్‌వేర్‌ని ఆషురెడ్డి ముంచేసిందా?

ashureddy-varma.jpg

మంగ్లీ మోసాల ముచ్చట ఓపక్క నడుస్తూనే ఉంది. ఈలోపు మరో సెలబ్రిటీ కాని సెలబ్రిటీపై దుమారం మొదలైంది. ఆషురెడ్డి. ఎవరీవిడ అని బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన పన్లేదు. రోత పనుల రాంగోపాల్‌వర్మ ఉన్నాడే.. అతగాడితో కాలి వేళ్లు చీకించుకుంది ఈవిడే. వర్మ అంతటోడే కాలివేళ్లను చీకేసరికి పాపులారిటీ వచ్చేసింది ఆషురెడ్డి. టీవీ షోలు, చిన్నచిన్న ప్రోగ్సామ్స్‌ చేసుకునే ఆషురెడ్డి ఎవడినో బకరాని చేసి తొమ్మిదిన్నర కోట్లు కాజేసిందన్న వార్త విని అంతా గుండెలు బాదేసుకుంటున్నారు.

ఆషురెడ్డి అసలు పేరు కొయ్య వెంకట అశ్వినీరెడ్డి, కాస్త పేరొచ్చేసరికి బిగ్‌బాస్‌కి కూడా వెళ్లొచ్చింది. ఈవిడ తనను పెళ్లిచేసుకుంటానని చీట్‌ చేసిందంటూ ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్ షేక్‌పేటకు చెందిన ఎనుముల సత్యనారాయణ కొడుకు ధర్మేంద్ర లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి… 2018లో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఈమె టచ్‌లోకి వచ్చింది. అతనే మనసు పడ్డాడో, మనోడు సౌండ్‌పార్టీ అని తెలిసి తనే ముగ్గులోకి లాగిందోగానీ..మొత్తానికి ఇద్దరి మధ్యా కొన్నాళ్లుగా లవ్‌ నడుస్తోంది. నిన్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించి ధర్మేంద్రతో ఆషురెడ్డి బంగారం, కారు, ఆస్తులు కొనుగోలు చేయించిందట. ఇప్పుడేమో పెళ్లికి నో చెప్పటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

ఆషురెడ్డి కుటుంబం ధర్మేంద్రతో ఏకంగా 5 కిలోల బంగారం కొనిపించిందట. పంతుళ్లను పిలిచి అదుగో నిశ్చితార్థం అని చెప్పి హడావుడి చేసిందట ఆషురెడ్డి కుటుంబం. కాబోయే బావగారి హోదాలో ఆషురెడ్డి చెల్లెలికి కూడా ఓ 50 లక్షలు ఇచ్చేశాడట ధర్మేంద్ర. సీసీఎస్‌ పోలీసులు కంప్లయింట్‌ అయితే బుక్‌చేసుకున్నారుగానీ.. ఈ కేసుమీద అందరికీ కొన్ని డౌట్లు కొడుతున్నాయి. ఎందుకంటే ధర్మేంద్ర లండన్‌లో ఉంటాడు. ఇంకా ఎంగేజ్‌మెంట్ కూడా కాలేదు. ముందే అంత గుడ్డిగా అంత ఎలా సమర్పించుకున్నాడనే అనుమానాలు కూడా వస్తున్నాయి. బుల్లితెర నటీమణులు సబ్‌స్క్రిప్షన్‌ పెట్టి స్పెషల్‌ షోలు చూపిస్తున్న రోజులివి. ఏమో.. ఆషురెడ్డి కూడా అందాన్ని ఎరగా వేసి ఆ సాఫ్ట్‌వేర్‌ని ముగ్గులోకి లాగిందేమో. పోలీసు ఇన్వెస్టిగేషన్‌లోనే తేలాలి నిజాలేంటో.

Share this post

submit to reddit
scroll to top