భూగోళాన్ని పైన మంచు దుప్పటి కప్పేస్తుంటే కింది నుంచి నిప్పుల కుంపటి వేడెక్కిస్తోంది. ప్రపంచానికి అటు ఇటు రెండు విపరీత వాతావరణాలు చోటు చేసుకున్నాయి. ఉత్తరార్ధ గోళంలో అమెరికా, రష్యాలను మంచు తుఫాన్లు ముంచెత్తుతున్నాయి. దక్షిణార్థ గోళంలోని ఆస్ట్రేలియాకు వేడిగాలుల సెగ తగులుతోంది. ఇక చిలీని కార్చిచ్చు కమ్మేస్తోంది.
అమెరికాను ఫెర్న్ మంచు తుఫాన్ వణికిస్తోంది. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, బోస్టన్ వంటి ఈశాన్య నగరాలపై ఈ వింటర్ స్టార్మ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. టెక్సాస్, కాన్సాస్, ఓక్లహోమా రాష్ట్రాల్లో ఇప్పటికే మంచు బీభత్సం మొదలైంది. మంచు తుఫాన్‌తో 8 నుంచి 16 అంగుళాల మేర భారీ హిమపాతం కురిసే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. అగ్రరాజ్యంలో వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. జార్జియా, మిస్సిసిపితో పాటు 17 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించారు.
అమెరికాలో సగం జనాభా.. అంటే 16కోట్లమందిపై ఈ తుఫాన్ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్ వెళ్లిన వెంటనే అమెరికాను ఆర్కిటిక్ చలి వణికించనుంది. ఆర్కిటిక్ ధృభూగోళాన్ని పైన మంచు దుప్పటి కప్పేస్తుంటే కింది నుంచి నిప్పుల కుంపటి వేడెక్కిస్తోంది. ప్రపంచానికి అటు ఇటు రెండు విపరీత వాతావరణాలు చోటు చేసుకున్నాయి. ఉత్తరార్ధ గోళంలో అమెరికా, రష్యాలను మంచు తుఫాన్లు ముంచెత్తుతున్నాయి. దక్షిణార్థ గోళంలోని ఆస్ట్రేలియాకు వేడిగాలుల సెగ తగులుతోంది. ఇక చిలీని కార్చిచ్చు కమ్మేస్తోంది.
అమెరికాను ఫెర్న్ మంచు తుఫాన్ వణికిస్తోంది. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, బోస్టన్ వంటి ఈశాన్య నగరాలపై ఈ వింటర్ స్టార్మ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. టెక్సాస్, కాన్సాస్, ఓక్లహోమా రాష్ట్రాల్లో ఇప్పటికే మంచు బీభత్సం మొదలైంది. మంచు తుఫాన్‌తో 8 నుంచి 16 అంగుళాల మేర భారీ హిమపాతం కురిసే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. అగ్రరాజ్యంలో వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. జార్జియా, మిస్సిసిపితో పాటు 17 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించారు.
అమెరికాలో సగం జనాభా.. అంటే 16కోట్లమందిపై ఈ తుఫాన్ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్ వెళ్లిన వెంటనే అమెరికాను ఆర్కిటిక్ చలి వణికించనుంది. ఆర్కిటిక్ ధృవం నుంచి విరుచుకుపడే గాలులు, అగ్రరాజ్యాన్ని డీప్ ఫ్రీజర్‌గా మార్చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఊహకందని విధంగా మైనస్ 45 డిగ్రీలకు టచ్ అవుతున్నాయి. అదే ఉత్తరార్థ గోళంలో ఉన్న రష్యాను కూడా మంచు తుఫాన్లు వణికిస్తున్నాయి. కార్లు, నివాసాలు మంచులో కూరుకుపోయాయి.
దక్షిణార్థ గోళంలో ఉన్న ఆస్ట్రేలియా మాత్రం అతి భారీ వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆ దేశంలో వాతావరణం రికార్డు స్థాయిలో వేడెక్కిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వేడికి ఆస్ట్రేలియాలో చెట్లుచేమలు తగలబడి, భారీగా కార్చిచ్చు మొదలైంది. ఉక్కపోత భరించలేక బీచ్‌లకు పరుగులు తీస్తున్నారు ఆస్ట్రేలియన్లు. కొన్ని రాష్ట్రాల్లో మంటలు వేయడంపై నిషేధం విధించారు.
అదే దక్షిణార్థ గోళంలో ఉన్న చిలీ కార్చిచ్చు సెగతో కకావికలమవుతోంది. దక్షిణ మధ్య చిలీలోని బియోబియో, ఉబ్లె ప్రాంతాల్లోని అడవుల్లో మొదలైన మంటలు దావానలంలా దేశమంతా వ్యాపించాయి. వందలాది ఇళ్లు దగ్ధమయ్యాయి.