ప్లాన్‌ బీ రెడీ.. తగ్గేదే లేదంటున్న ట్రంప్‌!

trump-Tariffs.jpg

మూర్ఖుడు రాజుకంటే బలవంతుడు. ట్రంప్‌ అదే కేటగిరీ. అందుకే అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలేసినా తగ్గేదే లేదంటున్నాడు. సుంకాల కొరడాతో ప్రపంచదేశాలను బాదేసిన ట్రంప్‌ని చాచి లెంపకాయ కొట్టింది అమెరికా సుప్రీంకోర్టు. పోయినేడాది ఆయన ప్రకటించిన ప్రతీకార సుంకాలను అక్కడి సుప్రీంకోర్టు రద్దుచేసింది.

ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్పు వస్తే అమెరికా సుమారు 175 బిలియన్ డాలర్ల టారిఫ్ ఆదాయాన్ని తిరిగి చెల్లించాల్సి రావచ్చని ఆర్థిక నిపుణులు ముందే అంచనా వేశారు.

సుంకాలను విధించే అధికారం అధ్యక్షుడికి లేదని తేల్చేసింది. కాంగ్రెస్ అనుమతి లేకుండానే విధానపరమైన చర్యలు తీసుకోవడానికి అధ్యక్షుడికి అధికారం లేదని అమెరికా సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. సుంకాలను విదేశాంగ విధాన సాధనంగా వాడుకోవడాన్ని అమెరికా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ప్రతినిధుల సభలో టారిఫ్‌లను కాంగ్రెస్ పరిశీలన నుంచి రక్షించాలన్న ప్రయత్నానికి ముగ్గురు అధికారపార్టీ సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ట్రంప్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది.

తానే సుప్రీంనంటున్న ట్రంప్‌ సుప్రీంకోర్టు ఆదేశాలకు తలొగ్గేందుకు సిద్ధంగా లేరు. సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తన దగ్గర ప్లాన్ బి రెడీగా ఉందంటూ తన తోక ఎప్పటికీ వంకరేనని చాటుకున్నారు. టారిఫ్‌లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన సమయంలో దాదాపు పాతికమంది గవర్నర్లతో ట్రంప్‌ ప్రైవేట్‌గా భేటీ అయ్యారు. కోర్టు తీర్పు తనకు కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థకే పెద్ద దెబ్బంటున్నారు ట్రంప్‌. అందుకే తానెంత మొండిఘటమో ప్రపంచానికి చూపేందుకు బుర్రకు మరింత పదును పెడుతున్నారు.

Share this post

submit to reddit
scroll to top