ట్రంప్ తెగింపు శృతిమించుతోంది. వెనిజులా అధ్యక్షుడిని, ఆయన భార్యను అమెరికాకు ఎత్తుకొచ్చింది డ్రగ్స్ కారణంతో కాదు. అపారంగా ఉన్న చమురు నిక్షేపాల కోసమేనని అందరికీ తెలుసు. గ్రీన్‌ల్యాండ్‌ను కోరుకునేది అమెరికా సైనిక అవసరాల కోసం కాదు.. అక్కడి ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్ గురించేనని కూడా తెలుసు. ఇప్పుడు భారత్‌పై వేస్తానంటున్న 500 శాతం టారిఫ్ కూడా క్రూడాయిల్ గురించే. డైరెక్ట్‌గానో, ఇన్‌డైరెక్ట్‌గానో.. మిగతా దేశాలపై యుద్ధానికి దిగుతున్న ట్రంప్.. భారత్‌పై మాత్రం టారిఫ్ వార్ చేస్తున్నారు.
2022 ఫిబ్రవరి 23 వరకు.. అంటే ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగేంత వరకు.. భారత్ తన క్రూడాయిల్ అవసరాల కోసం సౌదీ అరేబియా మీదే ఆధారపడింది. సౌదీ నుంచి 60 శాతం క్రూడాయిల్ కొనేది భారత్. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలుపెట్టాక.. అమెరికా ఆంక్షలు పెట్టాక.. పుతిన్ ఒక ఆఫర్ ఇచ్చారు. మార్కెట్ రేట్ కంటే 20 శాతం డిస్కౌంట్ ఇస్తామన్నారు. అప్పటి నుంచి సౌదీ దగ్గర ఆపేసి.. రష్యా నుంచే కొనడం మొదలుపెట్టింది. సౌదీ వాటా కాస్తా 60 శాతం నుంచి 11 శాతానికి పడిపోయింది. చైనా కూడా అంతే. సౌదీని పక్కనపెట్టి రష్యన్ క్రూడాయిల్ విపరీతంగా కొంటోంది. దీంతో రష్యా కారణంగా ఎక్కువగా నష్టపోతున్నది సౌదీనే.
రష్యానుంచి క్రూడాయిల్‌ని భారత్, చైనా డాలర్లతో కొనట్లేదు. లోకల్ కరెన్సీలతో కొంటున్నాయి. అందుకే ట్రంప్‌కి అంత కడుపుమంట. సుంకాల భయంతో ఆ రెండు దేశాలు రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లు ఆపేసి మళ్లీ సౌదీపై ఆధారపడతాయనే లాజిక్. అమెరికా మనమీద విధించిన 50 శాతం టారిఫ్‌లో సగం భారం.. రష్యా నుంచి ఇంధనం కొంటున్నందుకే. అయినా సరే భారత్ తగ్గడం లేదు. అమెరికా మాట వినడం లేదు. అందుకే ఈసారి 50 ప్లస్ 500 టారిఫ్ ఆఫర్. మొత్తం 550 పర్సెంట్ టారిఫ్‌కు ట్రంప్ రెడీ అవుతున్నారు. ఇదంతా తెరవెనుక ఉండి సౌదీ ఆడిస్తున్న ఆటే అనే వాదన ఉంది.
సౌదీ కోసం ట్రంప్ ఇంత ఫేవర్ చేస్తాడా అంటే చేస్తాడు. కాకపోతే ఆదేశంకోసం కాదు.. ఆ దేశంతో వ్యాపార సంబంధాలున్న అల్లుడి కోసం. ట్రంప్ అల్లుడు జరేద్ కుష్నర్ ననడుపుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీల్లో సౌదీ రాజు భారీ పెట్టుబడులు పెట్టాడు. ట్రంప్ కన్నేసిన గ్రీన్‌ల్యాండ్‌లో ముందుగా ల్యాండ్ అయింది కూడా ఈ అల్లుడే. మరోవైపు ట్రంప్ పేరుతో ఉన్న క్రిప్టో కరెన్సీలో సౌదీరాజు దాదాపు 18వేల కోట్ల పెట్టుబడి పెట్టారు. ఈ బిజినెస్ రిలేషన్లతోనే సౌదీకి అనుగుణంగా భారత్‌పై ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు.





