అవును.. అక్కడ గాలిపీలిస్తే ఆయుక్షీణం!

delhi-polution.jpg

ఏటా 15లక్షల మంది ఇండియాలో చనిపోతున్నారు. ఎందుకో తెలుసా. ఎలాగో తెలుసా. అకారణంగా, నిస్సహాయంతో భారత్‌ ప్రజలు బలిపశులు అవుతున్నారు. ఏటా భారత్‌లో వాయు కాలుష్యంతో సుమారు 15లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవేమీ నోటి లెక్కలు కాదు. మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో చెప్పే వాస్తవ సూచీలు. ఢిల్లీనే తీసుకోండి. అక్కడ గుండెల నిండా గాలిపీలిస్తే ప్రాణాలు పోయే పరిస్థితి. ఢిల్లీలో గాలి నాణ్యత-AQI 380-400 పాయింట్లుగా నమోదవుతోంది.

2024లో ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్‌ అధ్యయనం ప్రకారం దీర్ఘకాలం వాయు కాలుష్యం వల్ల ఏటా సుమారు 1.5 మిలియన్ల మంది చనిపోతున్నారు. 2025లో యూనివర్సిటీ ఆఫ్‌ చికాగో Air Quality Life Index నివేదికలో భారత ప్రజలు సగటు జీవితకాలం 3.5 సంవత్సరాలు తగ్గతూ వస్తోంది. దేశంలో 46శాతం మంది జనం PM2.5 ప్రమాణాలను మించి ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతమైతే అత్యంత ప్రమాదకరంగా మారింది. నివేదిక ప్రకారం అక్కడి ప్రజలు సుమారు ఐదేళ్ల ఆయుష్షుని కోల్పోతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గాలి నాణ్యత 5 మైక్రో గ్రాంఫర్ క్యూబిక్ మీటర్‌గా సెట్ చేసింది. ఇలా తక్కువ కాలుష్య ప్రాంతాల్లో సగటు జీవితకాలం సుమారు 9 నెలలు పెరుగుతుంది. WHO ప్రమాణాలతో, ఢిల్లీ-ఎన్‌సీఆర్ నివాసితులు సుమారు 8.2 సంవత్సరాల జీవితకాలం కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం రెండవ ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్‌గా ఉంది, బీపీ తర్వాత వాయుకాలుష్యమే మనుషుల ఆయుష్షును సగానికి తగ్గించేస్తోందంటున్నారు నిపుణులు. స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎయిర్‌-2025 నివేదిక ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా 7.9 మిలియన్ మంది వాయు కాలుష్యంతోనే మరణించారు, అంటే ఎనిమిది మందిలో ఒక్కరు వాయుకాలుష్యంతోనే చనిపోతున్నారు.

కేవలం గాలి కాలుష్యంతోనే లక్షలమంది ప్రాణాలు కోల్పోవడం అంటే భవిష్యత్తులో ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపే అతిపెద్ద సమస్య అదే. చిన్నపిల్లలు, వృద్ధులు, హృద్రోగులు, ఊపిరితిత్తుల సమస్యలున్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఇది కేవలం సీజనల్ సమస్యేకాదు, దీర్ఘకాలిక ఆరోగ్య, ఆర్థిక సామాజిక సవాల్. ప్రజలు- ప్రభుత్వం కలిసి కాలుష్య నియంత్రణకు పనిచేయకుంటే దేశరాజధాని ప్రాణాలు తీసే గ్యాస్‌ ఛాంబర్‌లో మారిపోతుందంటున్నారు నిపుణులు.

Share this post

submit to reddit
scroll to top