అదే తలబిరుసు..అవే తలతిక్క మాటలు. దేవుళ్లు కలలో కనిపించారట. 140కోట్ల భారతీయుల రక్షణను తన తలకెత్తుకోబోతున్నాడట. ఖబడ్దార్ కాషాయం అంటూ అరుస్తున్నాడు. బత్తాయిలంటూ బెదిరిస్తున్నాడు. గంటకో మాట, పూటకో వేషం, రోజుకో దేశం తిరిగే దేశదిమ్మరి నోటికొచ్చినట్లు వాగుతున్నాడు. కారుకూతలు కూస్తున్నాడు. ప్రపంచమంతా తిరుగుతున్నాడని ఫాలోవర్లు పెరిగితే చెవుల్లో ఫ్లవర్లు పెడుతున్నాడు.
ఒకసారి అంటే పొరపాటు అనుకోవచ్చు, రెండోసారి అంటే ఏమరుపాటు అనుకోవచ్చు. కానీ పదే పదే హిందూ దేవుళ్లను టార్గెట్ చేసుకుంటూ వెటకారపు వెక్కిరింతలు మాట్లాడితే ఏమనాలి. చాచిపెట్టి కొట్టాలనిపిస్తోంది కదూ. నెటిజన్స్ ఇప్పుడు అదే చేస్తున్నారు. ప్రపంచ యాత్రికుడి ఛానల్‌ని అన్‌సస్క్రైబ్ చేసుకుంటూ కుక్కకాటుకు చెప్పుదెబ్బ కొడుతున్నారు. భక్తిముసుగులో మతం మాటున దోపిడీలు చేస్తున్నారని, వాళ్లందరి భరతం పడతానంటున్నాడు ట్రావెలర్ అన్వేష్.
విదేశాల్లో ఉండి అన్వేష్ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. మహిళలను సపోర్ట్ చేస్తున్నా అంటూనే బూతులు మాట్లాడటం.. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసి అందరికీ టార్గెట్టవుతున్నాడు. ఈ వ్యాఖ్యలను హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రస్తుతం మలేషియాలో ఉన్న ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై తెలుగురాష్ట్రాల్లోనూ పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
యూట్యూబర్ అన్వేష్ అభ్యంతకర.. అనుచిత వ్యాఖ్యల వీడియోలను పోలీసులు స్కానింగ్‌చేస్తున్నారు. అతని సోషల్ మీడియా అకౌంట్లపై ఆరాలు తీస్తున్నారు. అన్వేష్ యూజర్ ఐడీ వివరాలు కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌కు హైదరాబాద్ పోలీసులు లేఖరాశారు. హీరోయిన్ల వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను ఖండించే క్రమంలో అన్వేష్ తన నోటికి పని చెప్పాడు. మాటలో మొరటుతనం ఉన్నా మనోడే కదాని ఇన్నాళ్లూ అంతా ఎంకరేజ్‌చేశారు. కానీ పిచ్చిముదిరింది. ఎర్రగడ్డలో షాక్ ట్రీట్మెంట్ ఇస్తేగానీ దారికొచ్చేలా లేడు మనోడు.





