గాల్లోనే ప్రాణాలు.. ఏం సాఫ్ట్‌వేరో ఏమో!

airbus-e1764562339288.jpg

ఊహించని ప్రమాదాలు.. ఆకతాయిల బాంబు బెదిరింపు కాల్స్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విమానాయాన సంస్థలను ఇప్పుడు మరో భయం వెంటాడుతోంది..అదే సోలార్‌ రేడియేషన్. ముఖ్యంగా ఎయిర్ బస్ విమానాలను ఈ సాంకేతిక సమస్య భయపెడుతోంది. ఇటీవల మెక్సికో నుంచి న్యూయార్క్‌కు వెళ్తున్న ఎయిర్‌బస్‌ A320 విమానం గాల్లో ప్రయాణిస్తున్న ఎత్తు ఉన్నట్టుండి ప్రమాదకర స్థాయికి తగ్గిపోయింది. దీంతో పైలెట్లు వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. దీనిపై దర్యాప్తు చేసిన అధికారులు ఈ ఘటనకు ‘ఎలివేటర్‌ అండ్‌ ఎలిరాన్‌ కంప్యూటర్‌’ వ్యవస్థలో వచ్చిన మార్పులే కారణమని గుర్తించారు. సోలార్‌ రేడియేషన్‌ దీనికి కారణమని తేల్చారు.

అసలేంటి సోలార్‌ రేడియేషన్‌ అంటే.. సూర్యుడి నుంచి వచ్చే శక్తివంతమైన కణాలు, విద్యుదయస్కాంత తరంగాల ప్రవాహం. అతినీలలోహిత కిరణాలు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు వంటి కణాల కారణంగా రేడియేషన్‌ ప్రభావం పడుతుంది. ఈ రేడియేషన్‌ వల్ల విమానాలకు సాంకేతిక సమస్యలు మొదలవుతాయి. సౌర తరంగాలతో విమానంలోని సున్నితమైన సాంకేతిక వ్యవస్థలు దెబ్బతింటాయి. నావిగేషన్‌, ఫ్లైట్‌ కంట్రోల్‌ డేటా వంటివి చెరిగిపోవడంతో రాంగ్‌ సిగ్నల్స్ అందుతాయి. విమాన భద్రతకు ఇది కీలక ముప్పుగా మారుతుంది

లేటెస్ట్ ఇష్యూతో అప్రమత్తమైన ఎయిర్‌బస్‌ సంస్థ ముందు జాగ్రత్త చర్యగా A320 విమానాలకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అవసరమని ప్రకటన చేసింది. దాదాపు 6వేల విమానాలకు ఈ తరహా అప్‌డేట్‌ ఇచ్చింది. అన్ని A320 విమానాలకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేషన్‌ చేయాల్సిన అవసరం లేదని..కొత్త ELAC మోడల్‌ ఉన్న విమానాల్లో సమస్య ఉండదని ఎయిర్‌బస్‌ చెబుతోంది. భారత్‌లో ఇండిగో దగ్గర అత్యధికంగా A320 మోడల్‌ విమానాలు ఉన్నాయి. అలాగే ఎయిరిండియా, విస్తారా వంటి ఎయిర్‌లైన్లు కూడా ఈ విమానాలను వాడుతున్నాయి.

Share this post

submit to reddit
scroll to top