బాలీవుడ్ స్టార్ షారూక్‌ఖాన్ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో బంగ్లాదేశ్‌కు క్రికెటర్‌ని భారీ ధరకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేయడంపై వివాదం రాజుకుంది. బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ అహ్మద్‌ను రూ.9.20 కోట్ల భారీ ధరకు షారూక్ ఐపీఎల్ టీమ్ కొనుగోలు చేయడంపై హిందూ సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై ఊచకోత జరుగుతున్న వేళ కింగ్‌ఖాన్ దేశద్రోహిలా ప్రవర్తిస్తున్నాడని విమర్శిస్తున్నాయి.
బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోత జరుగుతున్న సమయంలో షారూక్ బంగ్లాదేశ్ ప్లేయర్‌కు కోట్ల రూపాయలు చెల్లించి ఎలా కొనుగోలు చేస్తాయని హిందూ సంఘాలు ప్రశ్నించాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన తరువాతే ముస్తాఫిజుర్ అహ్మద్ ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆడించాలని వీహెచ్‌పీ నేతలు డిమాండ్ చేశారు. లేదంటే మ్యాచ్‌లను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. హిందూ మహాసభ నాయకురాలు మీరా రాథోడ్ షారూక్ నాలుక కోసిన వారికి లక్ష రూపాయల బహుమతి ప్రకటించారు. స్టేడియాలను తగలబెడతామని కొందరు హెచ్చరించారు.
ఈ వివాదాలతో బంగ్లాదేశ్ ప్లేయర్‌ని టీమ్ నుంచి రిలీజ్ చేయాలని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ని ఆదేశించింది బీసీసీఐ. దీంతో కోరి కొరివితో తలగోక్కోడమెందుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌నుంచి ముస్తాఫిజర్‌ని టీమ్ నుంచి విడుదల చేసింది. ఈ పరిణామాలతో ఇండియాలో 2026 టీ20 వరల్డ్ కప్ మ్యాచులు ఆడేందుకు బంగ్లాదేశ్ ప్లేయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
బంగ్లా ప్లేయర్లపై దాడులు జరిగే అవకాశం ఉందని బంగ్లా క్రికెట్ బోర్డు అనుమానాలు వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ మ్యాచ్‌ల వేదికలను మరోచోటికి మార్చాలని కోరబోతోంది. దీంతో తటస్థ వేదికపై ఈ సిరీస్ జరిగే అవకాశం ఉంది. లేదంటే పోయినేడాదిలాగే మొత్తానికే రద్దయ్యే అవకాశం కూడా ఉంది.





