మెలానియా W/O ట్రంప్‌.. ఓ డాక్యుమెంటరీ!

melania-trump-together-e1769487434719.jpg

అమెరికా చరిత్రలో హిస్టరీలో డొనాల్డ్ ట్రంప్ పేరు ఎప్పుడూ స్పెషలే. మొన్నటిదాకా తాను శాంతిదూతగా ప్రపంచం ముందు ప్రొజెక్ట్ చేసుకునేందుకు ఆపసోపాలు పడ్డాడు. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ అవతారమెత్తాడు. కాకుంటే ఇందులో ఆయన కనిపించరు. ఆయన సతీమణి కనిపించబోతున్నారు. వైట్ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి పెద్దగా ఎక్స్‌పోజ్‌ కాని మెలానియా జీవితాన్ని ప్పుడు ఒక పూర్తి స్థాయి డాక్యుమెంటరీ సిరీస్‌గా ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు .

మెలానియాను ఈ డాక్యుమెంటరీ ప్రధానంగా మూడు కోణాల్లో చూపిస్తుంది. మొదటిది యూరప్ నుంచి అమెరికాకు వచ్చిన ఒక వలస యువతికి ఎదురైన సవాళ్లు, రెండోది ట్రంప్ కుటుంబంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె ఎదుర్కొన్న ఒత్తిళ్లు. మూడోది ఫస్ట్ లేడీగా ఆమె తీసుకున్న నిర్ణయాలు. ఇలా మూడు కోణాల్లో మెలానియా జీవితాన్ని ఆవిష్కరించబోతున్నారు. డాక్యుమెంటరీలో ట్రంప్‌ను ఎక్కువగా చూపించరు. కానీ ట్రంప్ లేకుండా ఒక్క ఫ్రేమ్ కూడా ఉండదు.
ఇది ట్రంప్ పన్నిన తెలివైన వ్యూహంగా చూస్తున్నారు.

ట్రంప్‌ను ప్రపంచం ఇప్పటిదాకా తన కళ్లతోనే చూసింది. అదే మెలానియా ద్వారా చూపిస్తే మౌనం, బాధ, త్యాగం, కుటుంబం అనే భావాలు ముందుకొస్తాయి. ట్రంప్ రాజకీయ ప్రసంగాల సమయంలో మెలానియా హాహభావాలు, ఇమ్మిగ్రేషన్ అంశాలపై ఆమె తీసుకున్న స్టాండ్, వైట్ హౌస్‌కు కుటుంబంతో సహా రావడానికి ఎందుకు ఆలస్యం చేశారన్నదానిపై కొన్ని రియల్ సీన్స్ కూడా ఇందులో ఉంటాయని తెలుస్తోంది.

గతంలోనూ అమెరికా అధ్యక్షుల భార్యలపై ఇలాంటి డాక్యుమెంటరీ సిరీస్‌లు రూపొందాయి. మిచెల్ ఒబామా డాక్యుమెంటరీ, హిల్లరీ క్లింటన్‌పై రూపొందిన సిరీస్ రాజకీయ నాయకుల మానవీయ కోణాన్ని చూపించాయి. కానీ మెలానియా సిరీస్ ప్రత్యేకతేంటంటే ఇది పొలిటికల్ డాక్యుమెంట్ కాదు. కానీ అంతర్లీనంగా ట్రంప్ రాజకీయ జీవితమే కనిపించే అవకాశం ఉంది. పైగా డాక్యుమెంట్ సిరీస్ రూపొందించిన డైరెక్టర్ బ్రెట్‌ రాట్నర్. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు. అందుకే మెలానియా డాక్యుమెంటరీని అందరూ ట్రంప్ పీఆర్ క్యాంపెయినింగ్‌గానే చూస్తున్నారు.

Share this post

submit to reddit
scroll to top